బాలీవుడ్ కు వెళ్తాకానీ.. నా హిందీ టాలెంట్ చూశారంటేః నాని

0
28

టాలీవుడ్ లో నేచురల్ స్టార్ గా ఎదిగిపోయాడు నాని. అతని సహజమైన నటన అందరినీ ఇట్టే ఆకర్షిస్తుంది. ఆకట్టుకుంటుంది. అలాంటి నానీకి బాలీవుడ్లో సినిమా చేయాలని ఉందట. కానీ.. ఒకటే సమస్య అంటున్నాడు. అదే హిందీ భాష. అయితే.. మరీ ‘ఖానా ఖాతాహై.. పానీ పీతేహై టైపు’ హిందీ కాకుండా.. చక్కగానే మాట్లాడుతాడట. కానీ.. తనకు వచ్చిన హిందీ సినిమా లెవల్ కు సరిపోదు అంటున్నాడు.

అలాగని.. ఇప్పటికిప్పుడే ట్యూషన్ కు వెళ్లిపోవడాలు 30 రోజుల్లో హిందీ నేర్చుకోవడం ఎలా? అనే పుస్తకాలు చదవడాలూ గట్రా చేయడట. తనకు సినిమా ఆఫర్ రావాలి. వచ్చిన కథ తనకు నచ్చాలి. అది కూడా ఎలా ఉండాలంటే.. పట్టుబట్టి మరీ హిందీ నేర్చుకోవాలి అనే ఫీలింగ్ ను తనలో కలిగించాలట. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు తప్పకుండా హిందీ నేర్చుకొని మరీ.. బీటౌన్ లో అడుగు పెడతాడట నాని.

అదేంటీ..? భాషరాని వారు ఎంతోమంది నటిస్తున్నారు కదా అంటారేమో..! నాని విషయంలో అది కుదరదు. మనోడి బిరుదు ఏంటీ? నేచురల్ స్టార్! మరి ఆ ఫీలింగ్ నార్త్ ఆడియన్స్ కు కలగాలంటే వంక పెట్టలేని హిందీ మాట్లాడాలన్నది నాని ఆలోచన. అంతేతప్ప.. కెమెరా ముందుకు వెళ్లి వన్ టూ త్రీలు చదివే పని మాత్రం తనవల్ల కాదని చెబుతున్నాడు. ఎంతైనా నేచురల్ స్టార్ కదా.. అతని ఆలోచన సరైందే!

ఇక నాని టాలీవుడ్ కండీషన్ చూస్తే.. చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ‘టక్ జగదీష్’ రిలీజ్ దగ్గరికి వచ్చి ఆగిపోగా.. అంటే సుందరానికి శ్యామ్ సింఘరాయ్ షూటింగులు నిలిచిపోయాయి. ప్రస్తుతానికి ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here