బాలనటి శ్రియా శర్మ ఇప్పుడెలా ఉందో తెలుసా?

0
17

తెలుగులో జై చిరంజీవ రోబో వంటి చిత్రాల్లో బాలనటిగా ఆకట్టుకున్న శ్రియా శర్మ గుర్తుందా? ముద్దు ముద్దు మాటలతో అలరించిన ఆ బేబీ.. ఇప్పుడు యంగ్ లుక్ లో కేక పెట్టిస్తోంది. ‘కసౌటీ జిందగీ కే’ అనే హిందీ సీరియల్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రియాశర్మ.. ఆ తర్వాత పలు సినిమాల్లోనూ అలరించింది.

ఆ తర్వాత టీనేజ్ లోనే హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇచ్చింది. శ్రీకాంత్ తనయుడు హీరోగా నటించిన ‘నిర్మల కాన్వెంట్’ సినిమాతోపాటు గాయకుడు చిత్రంలోనూ హీరోయిన్ గా ఆకట్టుకుంది. ఆ తర్వాత మళ్లీ తెలుగులో కనిపించలేదు. ఈ అమ్మడికి సంబంధించిన లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రెడ్ సారీ మ్యాచింగ్ బ్లౌజ్ లో.. టాప్ టూ బాటమ్ ట్రెండీ లుక్ తో అదరగొడుతోంది శ్రియా. ఈ అమ్మడి ముగ్ధమనోహరమైన రూపం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ పాతికేళ్లకు దగ్గరవుతోంది. కెమెరా ముందు యాక్టింగ్ తోపాటు కోర్టులో వాదించడమూ ఇష్టం అంటోంది శ్రియా. మరి కాలం ఈ బ్యూటీని ఎటువైపు తీసుకెళ్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here