బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ధనుష్ ‘కర్ణన్’!

0
18

కోలీవుడ్ స్టార్ ధనుష్ లేటెస్ట్ మూవీ ‘కర్ణన్’. ఈ నెల 9వ తేదీన విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం.. రికార్డు వసూళ్లతో దూసుకెళ్తోంది.

తొలిరోజు 100% ఆక్యుపెన్సీతోనే మొదలైనప్పటికీ.. కరోనా నేపథ్యంలో తమిళ ప్రభుత్వం మరోసారి 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన అమల్లోకి తెచ్చింది. దీంతో.. రెండో రోజు నుంచే సగం సీటింగ్ కెపాసిటీతో సినిమా నడిపించాల్సి వచ్చింది. అయినప్పటికీ.. భారీ వసూళ్లతో నివ్వెర పరుస్తోంది.

వి.క్రియేషన్స్ బ్యానర్ పై కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మించారు. ధనుష్ సరసనరజీషా విజయన్ నటించారు. లాల్ యోగిబాబు ఇతర కీలక పాత్రల్లో నటించారు. అద్భుతమైన స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న ఈ సినిమా.. కరోనా భయం 50 శాతం సీటింగ్ లోనూ మంచి వసూళ్లు సాధిస్తోంది. విడుదలైన ఐదు రోజుల్లో 40 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసినట్టు సమాచారం. కరోనా ఆంక్షలు లేకుంటే.. ఈ చిత్రం మరింతగా కలెక్షన్లు కొల్లగొట్టేదని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here