బన్నీ మెచ్చిన ‘పుష్ప’ ఫ్యాన్ మేడ్ పోస్టర్..!

0
28

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ అనే యాక్షన్ డ్రామాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందే ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ పుష్ప రాజ్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ – టీజర్ తో అందరికీ షాక్ ఇచ్చాడు బన్నీ. గుబురు గడ్డం – డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో మొరటు కుర్రాడిగా బన్నీ రగ్గుడ్ లుక్ లో కనిపించాడు. ఈ ఊర మాస్ లుక్ అల్లు అర్జున్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక ‘పుష్పరాజ్’ ఇంట్రడక్షన్ టీజర్ లో తగ్గేదే లే.. అంటూ బన్నీ రాయలసీమ యాసలో పలికిన డైలాగ్ కి ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. అయితే ఇప్పుడు తన డై హార్డ్ ఫ్యాన్స్ క్రియేట్ చేసిన పోస్టర్ కి ఇప్పుడు అల్లు అర్జున్ ఫిదా అయ్యాడు.

‘పుష్ప’ ఫస్ట్ లుక్ వచ్చినప్పటి నుంచి అనేక ఫ్యాన్స్ మేడ్ పోస్టర్స్ సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. తమ ఫేవరేట్ హీరో బన్నీ సినిమాలో ఇలా ఉండాలి అంటూ ఈ పోస్టర్స్ ద్వారా అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పుడు వాటిలో ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ అల్లు అర్జున్ దృష్టిని ఆకర్షించింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించిన బన్నీ.. ‘ఈ ఫ్యాన్స్ మేడ్ పోస్టర్ నాకు బాగా నచ్చింది. ఈ గ్రాఫిక్స్ చాలా చాలా బాగున్నాయి. థాంక్యూ’ అని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ డిజైన్ చేసిన ఆ పోస్టర్ ని షేర్ చేసాడు. ‘పుష్ప’ ఫస్ట్ లుక్ మరియు టీజర్ లోని బన్నీ గెటప్స్ తో ఈ పోస్టర్ డిజైన్ చేశారు. గొడ్డలితో ఉన్న ఫోటో.. లాంతరు పట్టుకొని ఉన్న ఫోటోతో పాటుగా హీరోయిన్ రష్మిక మందన్నా కి కూడా ఇందులో చోటు కల్పించారు. అల్లు అర్జున్ మెచ్చిన ఈ ఫ్యాన్ మేడ్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here