ఫస్ట్ సినిమాలో నా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఉంటాయి: దగ్గుబాటి అభిరామ్

0
20

ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు చిన్న కొడుకు రానా సోదరుడు దగ్గుబాటి అభిరామ్ ని హీరోగా ఇంట్రడ్యూస్ చేయడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎట్టకేలకు స్టోరీ మరియు డైరెక్టర్ సెట్ అవడంతో దగ్గుబాటి వారసుడి లాంఛింగ్ కి ముహూర్తం కుదిరింది. ఇండస్ట్రీకి ఎంతో మంది కొత్తవారిని పరిచయం చేసిన క్రియేటివ్ డైరెక్టర్ తేజ చేతుల మీదుగా అభిరామ్ ని లాంచ్ అవుతున్నాడు. రానా తో ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా చేసిన తేజ.. ఇప్పుడు అభిరామ్ తో ఓ లవ్ స్టోరీని రూపొందించనున్నారు. హోమ్ బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ లోనే ఈ సినిమా రానుంది. అయితే ఈ ప్రేమకథకి తన రియల్ లైఫ్ ఘటనలతో సంబంధం ఉన్నట్లు అభిరామ్ స్వయంగా వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది.

అభిరామ్ దగ్గుబాటి తన పుట్టినరోజు సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డెబ్యూ మూవీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. తాను లవ్ స్టోరీస్ లో నటించాలని అనుకుంటున్నానని.. వాటిలో సొసైటీకి ఏదైనా మెసేజ్ ఇచ్చే కంటెంట్ ఉండేలా చూసుకుంటానని అభిరామ్ తెలిపాడు. ”ఇప్పుడు తేజతో చేస్తున్న సినిమాలో కూడా అలాంటి కంటెంట్ ఉంది. దీంతో నా గతం కొంచెం రివీల్ అయినట్లు అనిపించింది. ఫస్ట్ సినిమాలో నా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఈ సినిమా నా రియల్ లైఫ్ ని కూడా మార్చొచు” అని అభిరామ్ చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా యంగ్ స్టర్స్ ఎవరూ దూకుడుగా వెళ్ళొద్దని.. దూకుడుగా వెళ్తే తన లైఫ్ లో జరిగిన బ్యాడ్ ఎక్సపీరియన్స్ అందరికీ తెలుసని అభిరామ్ సలహా ఇచ్చాడు.

”నాకు జరిగింది వేరే ఫ్యామిలీకి జరగకూడదు. ఈ ఎఫెక్ట్ నాకు వచ్చింది. కానీ దాని వల్ల ఫ్యామిలీ పేరు పోతుంది. ఒకరి వల్ల మొత్తం ఫ్యామిలీ నేమ్ పోతుంది. ఏదైనా కావచ్చు అది నా తప్పు. నా ఫ్యామిలీ ఏ తప్పు చేయలేదు. కారుతో గుద్దినా అది నా మిస్టేక్. ఫలానా వారి కొడుకు ఫలానా వారి తమ్ముడు అని వాళ్ళ పేర్లు తీయకూడదు. మనం తప్పు చేస్తే మన పేరు రావాలి కానీ అందులో ఫ్యామిలీ పేరు రాకూడదు” అని అభిరామ్ అన్నారు. ‘బ్లాక్ మెయిలింగ్ అనేది అందరి లైఫ్ లో ఉంటుందని.. ఎవర్నీ నమ్మకూడదని.. మన లైఫ్ పట్ల మనమే కేర్ ఫుల్ గా ఉండాలని.. కోవిడ్ తో ఎంత జాగ్రత్తగా ఉంటున్నామో ఎదుటివారితో అంతే జాగ్రత్తగా ఉండాల’ని దగ్గుబాటి వారసుడు సూచించాడు. అయితే ఈ ఇంటర్వ్యూ చూసిన వారు గతంలో వివాదాస్పద నటి శ్రీరెడ్డితో జరిగిన వివాదాన్ని అభిరామ్ తన డెబ్యూలో చూపించబోతున్నాడేమో అని కామెంట్స్ చేస్తున్నారు. ఆయన చెప్పిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఏంటో తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here