ప్ర‌దీప్ అన్న‌య్య ఇంకా పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి కార‌ణం ఏమిటి?

0
119

MAA NAYAKUDU తెలుగు బుల్లితెర‌పై లేడీ యాంక‌ర్లు అంటే సుమ త‌ర్వాత అన‌సూయ‌, ర‌ష్మిలు గుర్తుకు వ‌స్తారు. ఇక మేల్ యాంక‌ర్ల విష‌యానికి వ‌స్తే ఓంకార్ త‌ర్వాత ప్ర‌దీప్ మాచిరాజు పేరునే చెప్పుకోవాలి. ఇప్పుడిప్పుడే సుడిగాలి సుధీర్‌, హైప‌ర్ ఆది, యాంక‌ర్ ర‌వి వంటి వారు స‌త్తా చాటుతున్నారు. ఇక విష‌యానికివ‌స్తే ప్ర‌దీప్ మాచిరాజు విష‌యానికి వ‌స్తే, తూర్పుగోదావ‌రి జిల్లా అమ‌లాపురంకి చెందిన ఈయ‌న బిటెక్ పూర్తి చేసి న‌టునిగా, యాంక‌ర్‌గా, టెలివిజ‌న్ నిర్మాత‌గా కూడా పేరు తెచ్చుకున్నాడు. రేడియో మిర్చిలో రేడీయో జాకీగా త‌న కెరీర్ ని ప్రారంభించాడు. వ‌రుడు, 100%ల‌వ్‌, జులాయి, అత్తారింటికి దారేది, రామ‌య్యా వ‌స్తావయ్యా, భ‌మ్ భోలే నాథ్ వంటి చిత్రాల‌లో న‌టించిన ఈయ‌న తాజాగా 30రోజుల్లో ప్రేమించ‌డం ఎలా? అనే చిత్రం ద్వారా హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఈచిత్రంలోని నీలి నీలి ఆకాశం పాట ఇప్ప‌టికే సూప‌ర్ స‌క్సెస్ అయింది. క‌రోనా లాక్ డౌన్ లేక‌పోతే ఈ పాటికే విడుద‌ల కావాల్సిన చిత్రం విడుద‌ల వాయిదాప‌డింది. లాక్ డౌన్ ముగిసి థియేట‌ర్లు ఓపెన్ అయిన త‌ర్వాత ఈమూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక ఈయ‌న గ‌డ‌స‌రి అత్త‌.. సొగ‌స‌రి కోడ‌లు, అదుర్స్, న‌ర్త‌న‌శాల‌, కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా, ఎక్స్ ప్రెస్ రాజా, ఢీ జోడీ, పెళ్లి చూపులు, కిక్, ప్ర‌దీప్ ద‌ర్బార్, డ్రామా జూనియ‌ర్స్, ల‌క్ష్మీ దేవి త‌లుపు త‌డితే  వంటి ప్రోగ్రామ్స్‌కి హోస్ట్‌గా ప‌నిచేశాడు. సంక్రాంతి పండుగ కోళ్లు, ఉగాది369, గ‌ణ‌ప‌తి బ‌ప్పా మోరియా, అహ‌నా పెళ్లంట‌, వ‌చ్చాడయో సామి, స‌రైనోళ్లు, స‌కుటుంబ స‌ప‌రివార స‌మేతంగా, సుధీర్ గాడి పెళ్లిగోల‌, ఉగాది అల్లుళ్లు వంటి షోల‌కు ప‌నిచేశాడు. ఇక ఈ మ‌ద్య మద్యం తాగి వాహ‌నం న‌డుపుతూ హైద‌రాబాద్ పోలీసుల చేతిలో డ్రంక్ అండ్ డ్రైవ్‌గా ప‌ట్టుబ‌డ్డాడు. ఇక ప్ర‌స్తుతం ప్ర‌దీప్ ఫుల్ బిజీగా, ఫ్రొఫెష‌న‌ల్‌గా తీరిక లేని బిజీగా ఉన్నాడు. ఏ సినిమా కార్య‌క్ర‌మ‌మైనా, బుల్లితెర షో అయిన ప్రదీప్ లేనిదే క్లిక్ కాదు అనే రేంజ్‌లో ఈయ‌న ఇమేజ్ ఉంది. అయితే అలాంటి ప్రదీప్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. అయితే బుల్లితెర మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచ్‌ల‌ర్ అయిన‌ప్ర‌దీప్ కి ఇంకా వివాహం కాక‌పోవ‌డంపై  ప‌లువురితో ఆస‌క్తి నెల కొని ఉంది. అయితే ఇంకా ప్ర‌దీప్ పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి అత‌ని కెరీరే కార‌ణ‌మ‌ని అంటున్నారు. యాంక‌ర్ గా ప్ర‌దీప్ బిజీ కావ‌డంతో అత‌డికి వ‌రుస ఆఫ‌ర్స్ వ‌చ్చి ప‌డ్డాయి.. వాటిని ఆయ‌న అంగీక‌రిస్తూ చేసుకుంటూ పోతున్నాడు. షూటింగ్‌ల‌తో క్ష‌ణం తీరిక లేకుండా బిజీగా మారాడు. క‌నీసం ఇంట్లో ఉండ‌టానికి కూడా స‌మ‌యం దొర‌క‌డం లేదంట‌. కుప్పలు తెప్ప‌లుగా డ‌బ్బు వచ్చి ప‌డింది. ఆ స‌మ‌యంలో ఆయ‌న‌కు అమ్మాయిల గురించి ఆలోచించ‌డం, ల‌వ్ లో ప‌డ‌టానికి కూడా  సమ‌యం దొర‌కలేదు. పెళ్లి చేసుకోవ‌డం, దాని వెనుక ఉండే తంతు వంటివి బిజీగా ఉన్న ప్ర‌దీప్ కి ఏమాత్రం అవ‌కాశం దొర‌క‌డం లేదు. దాంతో ఆయ‌న ఉన్న బిజీలో ఇవ్వ‌న్నీ ఆయ‌న ప్ర‌స్తుతానికి ప‌క్క‌న‌పెట్టేశాడు. దాంతో పెళ్లికి సంబంధించిన తతంగాల‌న్నింటినీ  చేస్తూ వ‌చ్చిన ఆయ‌న త‌ల్లిదండ్రులు కూడా త‌మ కుమారుడి తీరు ప‌ట్ల విసిగిపోయి పెళ్లి విష‌యాన్ని ప్ర‌దీప్ నిర్ణ‌యానికే వదిలేశార‌ట‌.. నిజానికి ప్ర‌దీప్ యాంక‌ర్ కాక‌ముందే ఓ అమ్మాయిని ప్రేమించాడు. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల వారు విడిపోయారు. ఆమెని త‌లుచుకుని ఇటీవ‌ల ఓ కార్య‌క్ర‌మంలో ప్ర‌దీప్ పాట పాడి మ‌రీ క‌న్నీరు కార్చాడు. ఆ స‌మ‌యంలో త‌న‌కి ఉపాధి లేక‌పోవ‌డం, ఆమెని పోషించే శ‌క్తి లేక‌పోవ‌డం వ‌ల్ల వారు ఇద్ద‌రు విడిపోయార‌ట‌. ఇప్పుడు ఆమె పిల్లా పాప‌ల‌తో ఉంద‌ని చెప్పిన ప్ర‌దీప్ ఆమె పేరుని మాత్రం చెప్ప‌లేదు. ఆ త‌ర్వాత ఎన్ని సంబంధాలు వ‌చ్చినా ప్ర‌దీప్ వాటికి నో చెబుతూనే వ‌స్తున్నాడు. బ‌హుశా ఆమె ఇంకా ప్ర‌దీప్ మ‌న‌సులోనే ఉండి ఉండ‌వ‌చ్చు అంటున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌దీప్ వ‌య‌సు 35 ఏళ్లు. అయితే ఈ వ‌యసులో ఆయ‌న పెళ్లి చేసుకోవ‌డానికి రెడీ అయిపోయాడు. ఆమ‌ధ్య స్వ‌యంవ‌రం కూడా ప్ర‌క‌టించాడు. ఈ స్వ‌యంవ‌రంలో త‌న‌కి కాబోయే భార్య‌ని ఎంపిక చేస్తాన‌ని చెప్పి మాట త‌ప్పాడు. బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన‌ప్పుడు పెళ్లి చేసుకుంటాన‌ని ప్ర‌క‌ట‌న ఇచ్చాడు. ఇప్ప‌టికైనా ప్ర‌దీప్ కి సంబంధం కుదురుతుందా? ఆయ‌న మ‌నసుని దోచే అమ్మాయి వ‌స్తుందా?  లేదా? అనేవి ఎదురు చూడాల్సివుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here