ప్రియుడితో కలిసి ఛార్టెట్ ఫ్లయిట్లో నయనతార.. మళ్లీ 8 నెలల తర్వాత అంటూ..

0
68

కేరళలో ఓనం పండుగ ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్న నేపథ్యంలో సినీ తారలందరూ మలయాళ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో తన సొంత రాష్ట్రంలో జరిగే ఓనం ఉత్సవాల్లో పాల్గొనేందుకు తన ప్రియుడు విఘ్నేష్ శివన్‌తో కలిసి నయనతార కోచికి చేరుకొన్నారు. అయితే ప్రత్యేక విమానంలో వీరిద్దరి కోచికి చేరుకోవడం మీడియాలో హైలెట్ అయింది. ఈ ప్రయాణం గురించి విఘ్నేశ్ శివన్ ట్వీట్ చేస్తూ.

నాలుగేళ్లుగా నయనతార డేటింగ్

నయనతార, విఘ్నేశ్ శివన్ డేటింగ్ వ్యవహారంపై దక్షిణాది మీడియాలో ఎప్పుడూ హాట్ చర్చ జరుగుతూనే ఉంటుంది. వారిపై రకరకాల వార్తలు, ఊహగానాలు మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతుంటాయి. గత నాలుగేళ్ల డేటింగ్‌కు ముగింపు ఎప్పుడా అనే ప్రశ్నలు మీడియాలో రేకెత్తుతుంటాయి.

కరోనావైరస్ వార్తపై విఘ్నేష్ సెటైర్

ఇలాంటి సమయంలో నయనతార, విఘ్నేశ్ శివన్‌కు కరోనా పాజిటివ్ అని తేలిందనే వార్త దక్షిణాది మీడియాలో వైరల్ అయింది. అయితే తమకు కరోనావైరస్ రాలేదంటూ వార్తలను కొట్టిపడేశారు. మీడియాపై సెటైటర్లు వేస్తూ షార్క్ చేప వీడియోను ట్వీట్ చేశారు. తమకు కరోనా వైరస్ అనే విషయంపై శ్రేయోభిలాషులు కంగారు పడ్డారు. మా ఆరోగ్యంపై ఆందోళన చెందిన వారికి మా ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.

ఓనం పండుగు వేడుకల్లో

కరోనా పరిస్థితుల కారణంగా చాలా నెలలుగా ఇంటికే పరిమితమైన నయనతార, విఘ్నేష్ తాజాగా ఓనం సందర్భంగా బయటకు వచ్చారు. పబ్లిక్‌తో ప్రయాణించకుండా ప్రత్యేకంగా ఛార్టెట్ ఫ్లయిట్‌ను ఏర్పాటు చేసుకొని కోచి నేలపై అడుగుపెట్టారు. ఈ సందర్భంగా విఘ్నేష్ శివన్ ట్వీట్ చేస్తూ 8 నెలల తర్వాత మబ్బుల్ని చూస్తున్నాను అని ట్వీట్‌లో తెలిపారు.

చార్టెడ్ ఫ్లయిట్‌లో ప్రత్యేకంగా

ప్రస్తుతం చార్టెడ్ ఫ్లయిట్‌లో నుంచి దిగిన నయనతార, విఘ్నేష్ శివన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వారిద్దరూ ఫ్లయిట్ దిగి నడుచుకొంటూ వస్తున్న ఫోటో మీడియాలో చక్కర్లు కొడుతున్నది. విఘ్నేష్ ఎరుపు టీషర్టు, బ్లూ జీన్స్‌లో, నయనతార బ్లాక్ డ్రస్‌లో కనిపించారు.

నయనతార, విఘ్నేష్ కెరీర్ ఇలా

విఘ్నేష్ విషయానికి వస్తే.. నెట్‌ఫ్లిక్స్ కోసం అంజలి, కల్కి కోచ్లిన్‌తో రూపొందించే చిత్రం కోసం కసరత్తు చేస్తున్నారు. అలాగే విజయ్ సేతుపతి, నయనతార, సమంత అక్కినేని రూపొందించే కాతు వాకులా రెండు కాదల్ సినిమాపై కూడా దృష్టిపెట్టారు. ఇక నయనతార విషయానికి వస్తే ఆర్జే బాలాజీ రూపొందించే మూకుతి అమ్మన్ చిత్రంతోపాటు రజనీకాంత్ అన్నాతే చిత్రంలో నటిస్తున్నారు. అలాగే అవల్ ఫేమ్ డైరెక్టర్ మిలింద్ రావు దర్శకత్వం వహించే నేత్రికమ్ అనే చిత్రంలో నటించడానికి అంగీకరించారు. ఇది కొరియన్ చిత్రం బ్లైండ్‌కు రీమేక్ అనే ప్రచారం జరుగుతున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here