ప్రియాంక చోప్రా భర్తకు ఆక్సిడెంట్

0
28

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు ప్రమోషన్ సాధించిన ప్రియాంక చోప్రా.. భర్త ప్రముఖ హాలీవుడ్ గాయకుడు నిక్ జోనస్. ఆయన షూటింగ్ సెట్లో ఆక్సిడెంట్‌కు గురయ్యారు. ఈ సంఘటన శనివారం రాత్రి లాస్  ఏంజెల్స్‌లో ఈయన షూటింగ్ చేస్తున్న సెట్లో జరిగింది. ఈ ఘటనలో నిక్ కు పెద్దగా గాయాలు కాకపోయినా.. ఆయన్ని వెంటనే హాస్పిటల్లో  జాయిన్ చేసారు. డాక్టర్లు  గాయాలైన చోట చికిత్స చేసిన అనంతరం ఆదివారం డిస్ఛార్జ్ చేసారు.

బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హాలీవుడ్ హీరో నిక్‏జోనాస్‏ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్‏లో క్వాంటికో సిరీస్‏లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు ప్రియాంక. అదే సమయంలో తనకంటే పదేళ్ళు చిన్నవాడైన నిక్‏జోనాస్‏ను 2018లో ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు.

అయితే ప్రస్తుతం నిక్ ప్రియాంక ఇద్దరు తమ కున్న సినిమా కమిట్మెంట్స్ కారణంగా విడివిడిగా ఉంటున్నారు.  రీసెంట్ గా ప్రియాంక చోప్రా తన ఆటోబయోగ్రఫీ ‘అన్ఫినిష్డ్’ పుస్తకాన్నివిడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో తన జీవితంలో ఇప్పటిదాకా బయిటకు రాని చాలా విషయాలు చర్చించారు. ఈ పుస్తకం మార్కెట్లో విడుదలైన వారంలోపే  న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్స్ లిస్ట్‌లో చేరి.. లెక్కలేనన్ని కాపీలు అమ్ముడుపోయింది. నిక్ తో పెళ్లి విషయంలో తన తల్లి అయిన మధు చోప్రా ఎంతో కీలక పాత్ర పోషించిందని ఈ పుస్తకంలో ప్రియాంక  చెప్పుకొచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here