ప్రశాంత్ సర్ ‘సలార్’ లీక్ పై దృష్టి పెట్టు

0
8

కేజీఎఫ్ తో దర్శకుడిగా ఒక్కసారిగా స్టార్ అయిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం కేజీఎఫ్ 2 ను విడుదలకు సిద్దం చేస్తున్నాడు. మొదటి కేజీఎఫ్ ను మించిన యాక్షన్ సన్నివేశాలతో పాటు అద్బుతమైన క్లైమాక్స్ తో కేజీఎఫ్ 2 సాగుతుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ చెబుతున్నాడు. ఇప్పటికే వచ్చిన టీజర్ సినిమా పై అంచనాలను ఆకాశానికి ఎత్తేశాయి. రికార్డు లు బద్దలు అయ్యేలా కేజీఎఫ్ 2 వసూళ్లు సాధిస్తుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. కరోనా కారణంగా ఆలస్యం అవుతున్నా కూడా కేజీఎఫ్ 2 పై ఏమాత్రం అంచనాలు తగ్గలేదు. పైగా కేజీఎఫ్ 2 బజ్ పెరుగుతూ ఉంది.

కేజీఎఫ్ 2 విడుదలకు ముందు ప్రశాంత్ నీల్ తదుపరి సినిమా ప్రభాస్ హీరోగా మొదలు పెట్టాడు. సలార్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సలార్ ఉంటుందనే నమ్మకంతో ఇండస్ట్రీ వర్గాల వారు ఉన్నారు. సలార్ సినిమా లోని యాక్షన్ సన్నివేశాలు కేజీఎఫ్ 2 ను మించి ఉంటాయని అంటున్నారు. సలార్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదల అయ్యింది. ఇక సలార్ నుండి మరో ఫొటో కూడా వచ్చింది. కాని ఈసారి వచ్చిన ఫొటో మేకర్స్ అధికారికంగా విడుదల చేసింది కాదు. సినిమా కు ఉన్న బజ్ నేపథ్యంలో ఈ ఫొటోను యూనిట్ సభ్యుల్లో ఎవరో గుర్తు తెలియని వారు లీక్ చేసినట్లుగా అనుమానం వ్యక్తం అవుతుంది.

కొన్ని రోజుల క్రితం ప్రభాస్ బైక్ పై వెళ్తున్న ఒక వీడియో లీక్ అయ్యింది. ఆ వీడియో కూడా కొన్ని గంటల్లోనే వైరల్ అయ్యింది. అయితే వెంటనే ఆ వీడియోను చిత్ర యూనిట్ సభ్యులు డిలీట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. మళ్లీ ఇప్పుడు ఒక ఫొటో లీక్ అవ్వడంతో మేకర్స్ ఏం చేస్తున్నారు అంటూ ప్రభాస్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు తమ అభిమాన హీరో ల ఫస్ట్ లుక్ లను మరియు సినిమా స్టిల్స్ ను చూడాలనుకుంటున్నారు. కాని లీక్ అయిన ఫొటోలను మాత్రం చూడాలని భావించరు. సినిమా క్రేజ్ ను లీక్డ్ పిక్స్ తగ్గిస్తాయి అనేది కొందరి అభిప్రాయం. అందుకే లీక్ అయిన ఫొటోలు మరియు వీడియోలను బాధ్యతగలిగిన అభిమానులు ఎవరు కూడా షేర్ చేయరు.

ఈ విషయంలో ప్రభాస్ అభిమానులు కూడా ప్రశాంత్ నీల్ ను ప్రశ్నిస్తున్నారు. కాస్త  ఈ లీక్ ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ముందు ముందు మరింతగా జాగ్రత్తలు తీసుకోకుంటే సలార్ సినిమా యాంటీ ఫ్యాన్స్ బ్యాడ్ చేసేందుకు మరిన్ని లీక్ లు కూడా ఇస్తారేమో అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకే సోషల్ మీడియా ద్వారా ప్రశాంత్ సర్ సలార్ లీక్ లపై దృష్టి పెట్టండి అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఇకపై అయిన సలార్ లీక్ ల విషయంలో ప్రశాంత్ నీల్ దృష్టి పెట్టేనా చూడాలి. ఇక తాజా లీక్ విషయానికి వస్తే సినిమా పై అంచనాలు పెంచేలా ప్రభాస్ లుక్ ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here