ప్రభాస్ హీరోయిన్ హాలీవుడ్ ఎంట్రీ..!

0
19

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి దశ ఎటు తిరుగుతుందో ఎవరు చెప్పలేరు. ఎందుకంటే కొన్నిసార్లు నెమ్మదించిన హీరోయిన్స్ ఒక్కోసారి ఒక్కసారిగా షాకింగ్ న్యూస్ తో సర్ప్రైజ్ చేస్తారు. ప్రస్తుతం అలాంటి సర్ప్రైజ్ ఇచ్చిన బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఈ శ్రీలంకన్ బ్యూటీ పదేళ్లుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతుంది. అలాగే దాదాపు బాలీవుడ్ హీరోలందరితో సినిమాలు చేసేసింది. అలాగే త్వరలో టాలీవుడ్ ఎంట్రీ కూడా చేయబోతుంది. అయితే అంతకంటే ముందు మరో క్రేజీ న్యూస్ చెప్పింది జాక్వెలిన్.

ఏంటంటే.. అమ్మడు త్వరలోనే ‘ఉమెన్స్ స్టోరీస్’ అనే ప్రాజెక్టుతో హాలీవుడ్ డెబ్యూ చేయబోతుంది. ప్రస్తుతం జాక్వెలిన్ హాలీవుడ్ ఎంట్రీకి సంబంధించిన న్యూస్ ‘టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ’గా మారింది. అయితే జాక్ కంటే ముందే బాలీవుడ్ నుండి చాలామంది స్టార్ హీరోయిన్స్ హాలీవుడ్ లో తమ అదృష్టం పరీక్షించుకున్నారు. ఇప్పుడు జాక్వెలిన్ ఉమెన్స్ స్టోరీస్ అనే ఆరు విభాగాల సంకలనంతో అడుగు పెడుతోంది. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఇది పూర్తిగా మహిళలకు సంబంధించిన చిత్రంగా తెరకేక్కుతుండగా.. ఈ సినిమాను రూపొందించేది కూడా ఫేమస్ మహిళా దర్శకులే. అలాగే పూర్తిగా ఉమెన్స్ మాత్రమే ఈ సినిమాలో నటించనున్నారు.

అయితే ఈ ఉమెన్స్ స్టోరీస్ లోని ‘షేరింగ్ ఏ రైడ్’ అనే పార్ట్ లో జాక్వెలిన్ కనిపించనుంది. ఆ విభాగానికి బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ లీనా యాదవ్ దర్శకత్వం వహించింది. జాక్వెలిన్ తో పాటు ట్రాన్స్జెండర్ మోడల్ అంజలి లామా కూడా పర్చడ్ ఫేమ్ డైరెక్టర్ తెరకెక్కించే విభాగంలో నటిస్తోంది. అయితే జాక్వెలిన్ ఫస్ట్ టైం హాలీవుడ్ తెరపై కనిపించడం పై ఆమె ఫ్యాన్స్ బాలీవుడ్ వర్గాలు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా.. జాక్వెలిన్ త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ చేయనుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘హరిహర వీరమల్లు’ సినిమాలో జాక్ కీలకపాత్ర పోషిస్తుంది. అంతకుముందు ఈ వయ్యారి డార్లింగ్ ప్రభాస్ తో బ్యాడ్ బాయ్ అనే పాటలో ఆడిపాడింది. చూడాలి మరి అమ్మడి అదృష్టం ఎలా ఉందో..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here