ప్రభాస్ మైండ్ లో ఆ ఒక్కడు ఎవరో తెలిస్తే షాక్ తింటారు!

0
28

ఎంతమంది పాన్ ఇండియా డైరెక్టర్లతో పని చేసినా.. ఎందరు క్యూలో ఉన్నా డార్లింగ్ ప్రభాస్ మనసు మాత్రం ఆ ఒక్క దర్శకుడిపై ఉందిట. ఇంతకీ అతగాడు ఎవరు? అంటే..

టాలీవుడ్ సహా బాలీవుడ్ డైరెక్టర్లంతా డార్లింగ్ తో సినిమాలు చేయాలని ఉత్సాహంగా ఉన్నారు. ఛాన్స్ ఎప్పుడొస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ వెయిటింగ్. కొంత మంది కథలు ఓకే చేయించుకుని డెవలప్ చేసే పనిలో ఉన్నారు. 2025 వరకూ అతడి కాల్షీట్లు లాక్ అయిపోయాయి కూడా. ఈలోగానే అతడిని లాక్ చేయగలిగేది మాత్రం ఒకే ఒక్క దర్శకుడు. ప్రభాస్ మనసులో ఒకే ఒక్క డైరెక్టర్ ఉన్నారు..అతనితో అవకాశం వస్తే మాత్రం మనసు పెట్టి ఓ సినిమా చేయాలని…ఆ ఛాన్స్ వస్తుందో లేదో కానీ.. అంటూ డార్లింగ్ ప్రస్థావించడం వేడెక్కిస్తోంది.

ఇంతకీ ఎవరా డైరెక్టర్? ప్రభాస్ అంతగా ఆసక్తి చూపిస్తున్న ఆ బాలీవుడ్ ఫిలింమేకర్ ఎవరు? అంటే.. అతడి మైండ్ లో సంచలనాల దర్శకుడే ఉన్నాడని తెలుస్తోంది. ది గ్రేట్ రాజ్ కుమార్ హిరాణీ పై ప్రభాస్ ఆసక్తిగా ఉన్నారు. `3 ఇడియట్స్`..  `మున్నాభాయ్ ఎంబీ బీఎస్`.. పీకే లాంటి సంచలనాల్ని తెరకెకక్కించిన గ్రేట్ డైరెక్టర్ ఆయన. తనతో సినిమా చేయాలని ఉందని ప్రభాస్ అన్నారు. ఎప్పటికైనా ఆయనతో ఓ సినిమా చేయాలని.. ఆ కల నెరవేరుతుందో లేదోనని సందేహం వ్యక్తం చేసాడు. మరి ఈ సంగతి హిరాణీ చెవిన పడితే ఎలా రియాక్ట్ అవుతారో?  

పీకే సినిమాతో  రాజ్ కుమార్ హిరాణీకి ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది. ఏలియన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభాస్ చూపు అలాంటి మరో ప్రయోగంపై ఉందని గెస్ చేస్తున్నారు. మరోవైపు మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తో ఓ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. అలాగే కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సలార్ అనే భారీ మాఫియా సినిమా చేస్తున్నాడు. అలాగే ఓంరౌత్ తో ఆదిపురుష్ 3డిలోనూ నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాలు షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here