ప్రభాస్ మూడు సినిమాలు ఒకేసారి..!

0
16

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మూడు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. రాధే శ్యామ్ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉండగా సలార్ మరియు ఆదిపురుష్ సినిమాలు కొంత మేరకు షూటింగ్ జరుపుకున్నాయి. కరోనా సెకండ్ వేవ్ కారణంగా మూడు సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయి. ఎట్టకేలకు ఇండస్ట్రీలో అన్ని సినిమాల షూటింగ్ లు పునః ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ప్రభాస్ కూడా ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా మూడు సినిమాల షూటింగ్ లకు హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఒక వైపు రాధే శ్యామ్ సినిమా షూటింగ్ లో ప్రభాస్ పాల్గొంటూ ఉండగా మరో వైపు ఆదిపురుష్ సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది. అయితే ఆదిపురుష్ ప్రస్తుత షెడ్యూల్ లో ప్రభాస్ పాల్గొనడం లేదు.

ప్రభాస్ రాధేశ్యామ్ ను ముగించే పనిలో ఉండగానే ఆదిపురుష్ ను మొదలు పెట్టినట్లుగా దర్శకుడు ఓమ్ రౌత్ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటికే ఆదిపురుష్ సినిమా కీలక షెడ్యూల్ నిర్వహించిన దర్శకుడు తాజాగా ప్రభాస్ లేకుండా ఇతర కీలక నటీ నటులతో షెడ్యూల్ కంటిన్యూ చేస్తున్నాడు. వారం పది రోజుల్లో రాధే శ్యామ్ సినిమా షూటింగ్ పూర్తి అవ్వబోతుంది. ఆ వెంటనే ఆదిపురుష్ షూటింగ్ లో జాయిన్ అవుతాడని సమాచారం అందుతోంది. మరో వైపు సలార్ సినిమా షూటింగ్ ను కూడా పునః ప్రారంభించేందుకు ప్రశాంత్ నీలు ఏర్పాట్లు చేస్తున్నారు. వారం పది రోజుల్లో ఆ సినిమా కూడా షూటింగ్ పునః ప్రారంభం అవ్వబోతుందని.. ప్రభాస్ లేకుండా మొదట కొన్ని రోజుల షూట్ చేసి ఆ తర్వాత ప్రభాస్ పై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు గాను ప్రశాంత్ నీల్ షెడ్యూల్ ను ప్లాన్ చేశాడని సమాచారం అందుతోంది.

ఈ నెలలోనే ప్రభాస్ మూడు సినిమాల షూటింగ్స్ జరుగబోతున్నాయి. అందులో రాధే శ్యామ్ కు గుమ్మడికాయ కొట్ట బోతున్నారు. ఇక మిగిలిన రెండు సినిమాల షూటింగ్స్ కూడా ఈ ఏడాది చివరి వరకు పూర్తి అయ్యేలా ప్లాన్ చేశారు. ఈ మూడు సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో వందల కోట్ల అంచనాలతో బరిలోకి దిగబోతున్నాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే రాధే శ్యామ్ సినిమాను ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇక సలార్ సినిమా ను వచ్చే సంక్రాంతికి ఆదిపురుష్ ను వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే విడుదల తేదీలు కూడా ఖరారు చేశారు. కాని కరోనా వల్ల షూటింగ్ లు ఆలస్యం అవుతున్న కారణంగా విడుదల తేదీల్లో మార్పులు వస్తాయేమో అంటున్నారు.

బాహుబలి మరియు సాహో ల తర్వాత ప్రభాస్ మార్కెట్ రేంజ్ పెరిగి పోయింది. అందుకే ఆయన మార్కెట్ కు తగ్గట్లుగానే భారీ బడ్జెట్ తో అద్బుతమైన విజువల్ వండర్స్ గా ఈయన దర్శకులు రాధే శ్యామ్.. సలార్ మరియు ఆదిపురుష్ లను తెరకెక్కిస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా కూడా భారీ అంచనాలను మోసుకు రాబోతుంది. ఆ సినిమా ఏకంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ను కలిగి ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. వచ్చే ఏడాది పట్టాలెక్కబోతున్న ఆ సినిమా 2023 కు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here