ప్రతి సామాన్య పౌరుడి తరపున ఇది నా విన్నపం.. పెరుగుతున్న పెట్రోల్ ధరలపై నిఖిల్ కౌంటర్

0
10

యువ హీరో నిఖిల్ సిద్దార్థ్ ఇటీవల కాలంలో సామాజిక అంశాలపై కాస్త ఎక్కువగానే స్పందిస్తున్నారు. కేవలం సహాయలు మాత్రమే చేయకుండా ఏదైనా తప్పు జరిగితే ప్రభుత్వాలను కూడా ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై సామాన్యులు ప్రశ్నిస్తున్న సమయంలో నిఖిల్ కూడా తనదైన శైలిలో ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ట్యాక్సులను రద్ధు చేయాలని నిఖిల్ ట్వీట్ చేశాడు.

పబ్లిసిటీ లేకుండానే

నిఖిల్ సిద్దార్థ్ కూడా కరోనా లాక్ డౌన్ కష్ట కాలంలో సామాన్యులకు తనవంతు సహాయం చేశాడు. సోషల్ మీడియా ద్వారా ఆక్సిజన్ సిలిండర్స్ ను అలాగే మెడిసిన్ ను సకాలంలో అంధించి చాలామంది ప్రాణాలకు ఊపిరి పోశాడు. పబ్లిసిటీ లేకుండానే నిఖిల్ తన మంచి పనులను కొనసాగించాడు.

పెరుగుతున్న పెట్రోల్ ధరలపై కౌంటర్

ఇక నిఖిల్ ఇదివరకే కరోనా సహాయలపై ప్రభుత్వాలను తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. రాజకీయ నాయకులు చేయాల్సిన పనులు సామాన్య ప్రజలు ఎక్కువగా చేస్తున్నట్లు వివరణ ఇచ్చారు. ఇక ఇటీవల పెరుగుతున్న పెట్రోల్ ధరలపై కూడా నిఖిల్ సిద్దార్థ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ప్రతి సామాన్య పౌరుడి తరపున ఇది నా విన్నపం..

నిఖిల్ ట్విట్టర్ లో ఈ విధంగా పేర్కొన్నాడు. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది. 35 రూపాయలు ఉండాల్సిన పెట్రోల్/డీజిల్ ధర ఫ్యూయల్ పంపు దగ్గర 100 రూపాయలు ఉంటుందని అన్నాడు. కేంద్ర, రాష్ట్ర ప్రబుత్వాలు వెంటనే ఇంధనంపై విధించే ట్యాక్సులను రద్ధు చేయాలని, ఈ రేట్లతో ఇబ్బంది పడుతున్న ప్రతి సామాన్య పౌరుడి తరపున ఇది నా విన్నపం.. అంటూ నిఖిల్ ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు.

ఫొటోతో కౌంటర్ ఇచ్చిన నిఖిల్

అదే విధంగా నిఖీల్ కౌంటర్ ఇచ్చే విధంగా ఓ ఫోటో కూడా షేర్ చేశారు. అందులో చెట్టుపై ఉన్న పెట్రోల్ మనిషికి అందడం లేదన్నాట్లుగా చూపించారు. ఇక నిఖిల్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం 18 పేజెస్ సినిమాతో సిద్దమవుతున్న విషయం తెలిసిందే. అలాగే కార్తికేయ సీక్వెల్ తో కూడా రెడీ అవుతున్నాడు. ఆ సినిమాను చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్నాడు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here