పెళ్లితో వచ్చిన మార్పు అదేనన్న రానా

0
11

మూస ధోరణిలో వెళ్లే ప్రతిసారీ.. ఎవరో ఒకరు రావటం.. దాన్ని మార్చే ప్రయత్నం చేస్తుండటం కనిపిస్తూ ఉంటుంది. మిగిలిన రంగాలకు భిన్నమైన టాలీవుడ్ లో మూస ధోరణిపై బాణం ఎక్కు పెట్టే ధైర్యం చేసేందుకు కొమ్ములు తిరిగిన సీనియర్లు సైతం ముందు వెనుకా ఆడుతుంటారు. అందుకు భిన్నంగా.. తనదైన రీతిలో రియాక్టు కావటమేకాదు.. నటుడు అన్నవోడు ‘ఇమేజ్’ చట్రంలో ఇరుక్కుపోకూడదన్న రీతిలో తన నిర్ణయాలతో బదులిస్తుంటారు దగ్గుబాటి రానా.

మిగిలిన టాలీవుడ్ నటులకు భిన్నంగా ఆయన ప్రయోగాలు ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో ఉంటూనే.. అందుకు భిన్నమైన వ్యాపారాలు చేయటం ఆయనకు అలవాటు. ఓవైపు సినిమాలు.. మరోవైపు వ్యాపారాలు చేసే రానా తీరుపై ఇండస్ట్రీలో అప్పుడప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతుంటుంది. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ అన్న ట్యాగ్ ను పక్కన పెట్టేసి.. పెళ్లి చేసుకున్న రానా.. తన పెళ్లిపై వచ్చే ప్రశ్నలకు పుల్ స్టాప్ పెట్టేశారు.

తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడిన రానా.. ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. మరీ.. ముఖ్యంగా పెళ్లి తర్వాత దాని మీద పెద్దగా స్పందించని ఆయన.. తాజా ఇంటర్వ్యూలో ఆ లోటు తీర్చారు. పెళ్లైన తర్వాత తన జీవితంలో కొత్త ఎనర్జీ వచ్చిందన్నారు.

బలంగా ఉన్నానని.. వ్యక్తిగతంగా ఒక మంచి బిగినింగ్ అని చెప్పిన ఆయన.. పెళ్లైన తర్వాత ఫుల్ ఖుషీగా ఉన్నానన్న విషయాన్ని చెప్పేశారని చెప్పాలి. కరోనా కారణంగా వచ్చిన లాక్ డౌన్ సమయంలో ఖాళీగా ఉన్నప్పటికీ.. ఎన్నో కథల్ని వినే అవకాశం కలిగినట్లు చెప్పారు. అందులో కొన్ని ఆసక్తికర కథల్ని ఎంచుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తాను చేస్తున్న మలయాళం రీమేక్ అయ్యప్పనుమ్ కోషియమ్ చిత్రం తర్వాత.. సూపర్ యాక్షన్ హీరో సినిమా చేస్తానంటూ చేసిన వ్యాఖ్య ఆయన అభిమానులకు ఆనందానికి గురి చేయటం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here