పూల్ సైడ్ అన్ లిమిటెడ్ ట్రీట్

0
23

బాలీవుడ్ లో ఉన్న రేర్ ట్యాలెంట్ గా ఆలియా పేరు మార్మోగుతోంది.  దీపిక పదుకొనే – కత్రిన లాంటి స్టార్లు అభిమానించే నేటితరం భామగా ఆలియా ఓ వెలుగు వెలుగుతోంది. ఇక దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తన నటప్రతిభను మెచ్చి ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా సినిమాలో అవకాశం కల్పించారు. అల్లూరి(చరణ్) సరసన సీతగా నటిస్తోంది ఈ బ్యూటీ.

ఇక సౌత్ అభిమానులకు ఇప్పటికే ఆలియా సోషల్ మీడియా వేదికల్లో ఫుల్ గా టచ్ లో ఉందీ భామ. మగధీర సరసన నటిస్తోంది అనగానే మెగాభిమానులు ఆలియాను ఇన్ స్టాలో అనుసరిస్తున్నారు. ఆ రకంగా ఈ అమ్మడికి ఫాలోయింగ్ అమాంతం పెరిగింది.

అందుకు తగ్గట్టే సోషల్ మీడియాల్లో ఆలియా మెగా ట్రీట్ తో చెలరేగుతోంది. ఇటీవల వరుస ఫోటోషూట్లను షేర్ చేస్తోంది. తన అభిమానులకు అవసరమైన వినోదాన్ని ప్లాన్ చేస్తోంది. ఇక ఆలియా అన్ లిమిటెడ్ పూల్ సైడ్ ట్రీట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇటీవలే ఈ భామ ఈత కొలనులో స్విమ్ చేస్తున్న ఫోటోల్ని షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి. అందులో ఓ స్పెషల్ ఫోటో అభిమానుల వాట్సాపుల్లో వైరల్ గా మారింది. ఆర్.ఆర్.ఆర్ తో పాటు గంగూభాయి కతియావాడీ.. బ్రహ్మాస్త్ర వంటి భారీ పాన్ ఇండియా చిత్రాల్లో ఆలియా నటిస్తోంది. ఇవన్నీ రిలీజ్ లకు రావాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here