పూరి గారు రౌడీ అప్డేట్ ప్లీజ్

0
31

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘లైగర్’. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమా ను పూరి సొంత బ్యానర్ లో ఛార్మి మరియు కరణ్ జోహార్ లతో కలిసి నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయ్యింది. గత ఏడాది ఆరంభంలో షూటింగ్ చేస్తున్న సమయంలో అనూహ్యంగా కరోనా వచ్చి మార్చిలో షూటింగ్ నిలిచి పోయింది. గత ఏడాది అంతా కూడా షూటింగ్ చేయకుండా వాయిదాలు వేస్తూ వచ్చారు. ఈ ఏడాది షూటింగ్ ప్రారంభం అయిన వెంటనే కరోనా సెకండ్ వేవ్ మొదలు అవ్వడంతో మళ్లీ నిలిపి వేయడం జరిగింది.

ఈ సినిమా కోసం భారీ ఎత్తున యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందట. అందుకు విదేశీ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ తో పాటు పెద్ద ఎత్తున ఫైటర్లు కావాల్సి ఉందట. ఆ కారణంగానే షూటింగ్ విషయంలో ఆలస్యం జరుగుతుందని అంటున్నారు. మళ్లీ లైగర్ ఎప్పటికి పునః ప్రారంభం అవుతుందో చెప్పలేని పరిస్థితి. లైగర్ సినిమా ఈ ఏడాదిలో రావడం అనుమానంగానే ఉందంటూ రౌడీ అభిమానులు అంటున్నారు. సినిమా విడుదల ఆలస్యం అయినా పర్వాలేదు కాని సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇవ్వాలంటూ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.

సోషల్ మీడియాలో లైగర్ అప్ డేట్ కావాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. పూరి గారు లైగర్ సినిమా అప్ డేట్ వచ్చి చాలా కాలం అయ్యింది. ఇప్పటికి అయినా ఒక పోస్టర్ లేదా పాటను విడుదల చేయండి అంటూ సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. ఈ సినిమా లో హీరోయిన్ గా అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా చాలా విభిన్నంగా ఉంటుందని.. విజయ్ లుక్ చాలా ప్రత్యేకంగా ఉంటుందని ఇప్పటికే విడుదల అయిన ఫస్ట్ లుక్ తో క్లారిటీ వచ్చింది. అయినా కూడా విజయ్ కొత్త పోస్టర్ కావాలంటూ రౌడీ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here