‘పుష్ప’ కోసం ఆస్కార్ అవార్డ్ గ్రహీత..!

0
15

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ”పుష్ప”. డైరెక్టర్ సుకుమార్ ఈ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాని తెరకెక్కిస్తున్నాడు. స్టార్ క్యాస్టింగ్ – అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ బడ్జెట్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఇందులో రష్మిక మందన్నా ను హీరోయిన్ గా.. మలయాళ నేచురల్ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్ గా ఎంచుకున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఆస్కార్ అవార్డ్ గ్రహీత రసూల్ పూకుట్టి ‘పుష్ప’ సినిమా కోసం వర్క్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

స్లమ్ డాగ్ మిలీనియర్’ చిత్రానికి అకాడెమీ అవార్డ్ అందుకున్న ప్రముఖ సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి.. ‘పుష్ప’ సినిమాని సౌండ్ డిజైనింగ్ చేయనున్నారు. అలానే రజినీకాంత్ – విజయ్ – అజిత్ వంటి స్టార్ హీరోల సినిమాలకు వర్క్ చేసిన ప్రముఖ ఎడిటర్ ఆంటోనీ రూబెన్ ‘పుష్ప’ మూవీకి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని తెలుస్తోంది. కాగా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ముత్యంశెట్టి మీడియా సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళం మలయాళం కన్నడ హిందీ భాషల్లో ఆగస్టు 13న వల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here