పుష్పలో రంగమ్మత్తను మించి..!

0
20

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప లో అనసూయ ఉందా లేదా.. ఉందా లేదా అనే సస్పెన్స్ కు తెర పడింది. అనసూయ పుష్ప సినిమా లో నటించబోతున్నట్లుగా వచ్చిన వార్తలపై చిత్ర యూనిట్ సభ్యులు స్పందించక పోవడంతో ఆమె లేదేమోనని అంతా భావించారు. ఆ విషయం గురించి చర్చ ఆగిపోయిన సమయంలో అనసూయ స్వయంగా పుష్ప క్లాప్ బోర్డును షేర్ చేసి తాను సుకుమార్ సినిమాలో మరోసారి కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా చెప్పకనే చెప్పింది. అనసూయ ఆ విషయం క్లారిటీ ఇచ్చినప్పటి నుండి ఆమె చేయబోతున్న పాత్ర గురించి మీడియా వర్గాల్లో తెగ చర్చ జరుగుతూనే ఉంది.

సుకుమార్ గత చిత్రం రంగస్థలం లో రంగమ్మత్త పాత్ర ఇన్నాళ్లు అయినా కూడా గుర్తుండి పోయింది. రంగమ్మత్త పాత్రలో అనసూయ కనిపించిన తీరు.. ఆమె నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అనసూయ పలు సినిమాల్లో కనిపించింది. కాని ఆ రేంజ్ గుర్తింపు మాత్రం దక్కించుకోలేక పోయింది. రంగమ్మత్త పాత్ర తో అనసూయకు వచ్చిన గుర్తింపును మరపించేలా పుష్ప లో గిరిజన మహిళ పాత్ర ఉంటుందని అంటున్నాను. పాత్ర పేరు కూడా చాలా క్యాచీగా భలే ఉండే అన్నట్లుగా ఉంటుందని యూనిట్ సభ్యులు అంటున్నారు.

జబర్దస్త్ యాంకర్ అనసూయ వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నా కమర్షియల్ సక్సెస్ లు తెస్తున్నవి మాత్రం అంతంత మాత్రమే. ఇటీవలే ఆహా ద్వారా థ్యాంక్యూ బ్రదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిండు గర్బిణిగా ఆ సినిమాలో అనసూయ కనిపించింది. కాని ప్రేక్షకులు ముఖ్యంగా అనసూయ అభిమానులు మాత్రం సినిమాపై పెదవి విరిచారు. జబర్దస్త్ యాంకర్ రంగమ్మత్తను తాము ఇలా చూడాలని కోరుకోవడం లేదు అంటూ తేల్చి చెప్పారు. థ్యాంక్యూ బ్రదర్ ఫలితం నిరాశ పర్చినా పుష్ప లో రంగమ్మత్తను మించిన పాత్ర చేస్తున్నాను అంటూ అనసూయ సన్నిహితుల వద్ద అంటుందట. ఆగస్టులో పుష్ప ను విడుదల చేయాలని భావిస్తున్నారు. మరి కరోనా విడుదల సాఫీగా అయ్యేలా చేస్తుందా లేదా అనేది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here