పవన్ హీరోయిన్ ఆవేదన.. ఇద్దరు కజిన్స్ మృతి

0
16

కరోనా కరాళ నృత్యం చేస్తోంది. సెకండ్ వేవ్ వేలాది మంది ప్రాణాలను పొట్టనపెట్టుకుంటోంది. పెద్ద ఎత్తున మృతుల సంఖ్య నమోదు అవుతుంది. ఈ సమయంలో ఆక్సీజన్ అందక.. ఆసుపత్రుల్లో బెడ్స్ లభించక చికిత్స పొందలేక కూడా కొందరు ప్రాణాలు వదులుతున్నారు. సరైన సమయంలో చికిత్స అందిస్తే బతికే వారు కూడా ఆక్సీజన్ కొరత ఇతరత్ర కారణాల వల్ల మృతి చెందుతున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ తో హీరోయిన్ గా నటించిన మీరా చోప్రా కజిన్స్ ఇద్దరు మృతి చెందారు.

ఆ విషయమై మీరా చోప్రా స్పందించారు. ఆమె ఎమోషనల్ అయ్యింది. సోషల్ మీడియాలో ఆమె తన కజిన్స్ మృతి విషయాన్ని షేర్ చేసింది. దాదాపు పది నెలల తర్వాత పరిస్థితులు కుదుట పడుతున్నాయని అనుకుంటున్న సమయంలో మళ్లీ అనూహ్యంగా సెకండ్ వేవ్ రూపంలో కరోనా ముంచుకొచ్చింది. తక్కువ సమయంలో ఇద్దరు కజిన్స్ ను కోల్పోయినట్లుగా ఆవేదన వ్యక్తం చేసింది. ఇద్దరు కూడా 40 ఏళ్ల వయసు కావడం విచారం. వారిద్దరు కూడా కరోనాతో కాకుండా చికిత్స అందకపోవడం వల్ల మృతి చెందారంది.

ఆసుపత్రిలో బెడ్ లేక పోవడం వల్ల ఒకరు.. ఆక్సీజన్ అందక మరొకరు మృతి చెందారు. వాళ్లను రక్షించుకోలేక పోయానే బాధ నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంది. ఇద్దరి మృతి తర్వాత ఏ సమయంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అనే ఆందోళన ఉంది. ఇలాంటి పరిస్థితులు ముందు ఎప్పుడు ఎదురు కాలేదు. లక్షలు ఖర్చు చేసినా కూడా ప్రాణాలు కాపాడుకోలేని పరిస్థితి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here