‘పవన్ – హరీష్’ మూవీ క్రేజీ అప్డేట్..!

0
18

టాలీవుడ్ లో హీరో – డైరెక్టర్ కాంబినేషన్లలో కొన్నింటికి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అలాంటి వాటిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – పవర్ ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే వీరి కలయికలో వచ్చింది ఒక్క సినిమానే అయినా దాని ఇంపాక్ట్ తొమ్మిదేళ్లయినా కూడా ఇంకా అలానే ఉంది. 2012లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సూపర్ హిట్ అవడమే కాకుండా అప్పటికి పవన్ కెరీర్ లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. అందుకే ఈ పవర్ ఫుల్ కాంబోలో మరో సినిమా రావాలని అభిమానులు బలంగా కోరుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్ – హరీష్ కలిసి ‘#PSPK28’ చిత్రాన్ని ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని – రవి శంకర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.

పవన్ – హరీష్’ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి తీసుకెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇటీవలే ఈ సినిమా కోసం స్పెషల్ గా ఫోటోషూట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. హీరోల లుక్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునే హరీష్ శంకర్.. ‘గబ్బర్ సింగ్’ తరహాలోనే ఈ సినిమాలో కూడా పవర్ స్టార్ ని స్టైలిష్ గా చూపించబోతున్నారని తెలుస్తోంది. విభిన్నమైన కాన్సెప్ట్ పోస్టర్ తో సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసిన హరీష్.. ఈ చిత్రానికి ‘సంచారి’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. హరీష్ ఈసారి వినోదంతో పాటుగా సోషల్ మెసేజ్ కూడా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో సినిమా రెగ్యులర్ షూట్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here