పవన్ ముందు రూ. 80 కోట్ల ఆఫర్: చరిత్ర సృష్టించేందుకు ఒక్క అడుగు దూరంలో పవర్ స్టార్.!

0
65

చాలా కాలంగా సినిమాలకు దూరమైనా క్రేజ్‌ను మాత్రం కోల్పోలేదు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. కెరీర్ ఆరంభం నుంచే జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసిన ఆయన… రాజకీయాల కోసం పరిశ్రమకు దూరమయ్యాడు. ఇక, ఈ మధ్యనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించి అభిమానుల్లో జోష్‌ను నింపాడు. ఇందులో భాగంగానే వరుసగా మూవీలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో పవన్ చెంతకు రూ. 80 కోట్ల ఆఫర్ వచ్చిందట. దీనికి ఆయన ఓకే అంటే టాలీవుడ్ సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయమే. ఇంతకీ ఏంటా ఆఫర్.? వివరాల్లోకి వెళితే….

ఇద్దరూ కలిశారు.. పవన్‌ను ఒప్పించారు

ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇందుకోసం త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ తర్వాత సినిమాలకు దూరమయ్యాడు. ఆ తర్వాత క్రియాశీల రాజకీయాల్లో బిజీ అయ్యాడు. అప్పుడే ఇకపై సినిమాలు చేయనని ప్రకటించాడు. కానీ, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, దిల్ రాజు కలిసి పవన్‌ను రీఎంట్రీకి ఒప్పించారు.

పెద్ద సాహసమే చేస్తున్న పవన్ కల్యాణ్

సుదీర్ఘ విరామం తర్వాత ‘వకీల్ సాబ్’ అనే సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు పవన్ కల్యాణ్. ఇది బాలీవుడ్‌లో సూపర్ డూపర్ హిట్ అయిన ‘పింక్’కు రీమేక్. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీని వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్నాడు. నివేదా థామస్, అంజలి, అనన్య హీరోయిన్లు. రీఎంట్రీ కోసం తెలిసిన కథను ఎంపిక చేసుకుని పవన్ పెద్ద సాహసమే చేస్తున్నాడు.

దీనికితోడు ఇద్దరు దర్శకులతో మూవీ

‘వకీల్ సాబ్’ సినిమా పట్టాలపై ఉండగానే పవన్ కల్యాణ్… మరో ఇద్దరు దర్శకులతో సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అందులో ఒకరు క్రిష్ జాగర్లమూడి కాగా, మరొక దర్శకుడు హరీశ్ శంకర్. ఈ రెండు సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు కూడా పవన్ పుట్టినరోజున వచ్చాయి. దీంతో ప్రస్తుతం ఆయన చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి.

ఆ విషయంలో మాత్రం పవన్‌కు నిరాశే

2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల వరకు పవన్ కల్యాణ్ వీలైనన్ని సినిమాలు చేయనున్నాడని తెలుస్తోంది. ఇందులో భాగంగానే వరుసగా మూవీలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా రూపంలో ఆయనకు నిరాశే ఎదురైంది. లాక్‌డౌన్ కారణంగా ‘వకీల్ సాబ్’ షూటింగ్ నిలిచిపోవడంతో మిగిలిన సినిమాలూ వాయిదా వేయాల్సి వచ్చింది.

మూడూ అదుర్స్.. అంచనాలు రెట్టింపు

పవన్ ప్రస్తుతం నటిస్తున్న ‘వకీల్ సాబ్’ మూవీ షూటింగ్ దాదాపు ఎనభై శాతం పూర్తయింది. ఎన్నో అంచనాల నడుమ తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్, రెండు పాటలు, మోషన్ పోస్టర్ విడుదలయ్యాయి. ఈ మూడింటికీ ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు, దీనిపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా రెట్టింపు అయిపోయాయి.

పవర్ స్టార్ ముందు రూ. 80 కోట్ల ఆఫర్

కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తుండడంతో దేశ వ్యాప్తంగా సినిమా థియేటర్లు మూతబడ్డాయి. ఈ నేపథ్యంలో ఓటీటీ ఫ్లాట్‌ఫాంలు ఉన్న సంస్థలన్నీ తెలుగు సినిమాలను విడుదల చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు ‘వకీల్ సాబ్’కు కూడా ఇదే ఆఫర్ వచ్చిందట. ఇందుకోసం అమెజాన్ ప్రైమ్ ఏకంగా రూ. 80 కోట్లు ఆఫర్ చేసిందని ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది.

చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో

ఈ ఆఫర్ విషయమై అమెజాన్ సంస్థ ఇప్పటికే చిత్ర నిర్మాతలు దిల్ రాజు, బోనీ కపూర్‌తో చర్చలు జరపడానికి ప్రయత్నాలు కూడా చేసిందట. దీనికి వాళ్లు ఒప్పుకుని… ఆ తర్వాత పవన్ కల్యాణ్ పర్మీషన్ కూడా ఇస్తే ‘వకీల్ సాబ్’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల అవుతుంది. అదే కనుక జరిగితే భారీ ధరకు అమ్ముడైన తెలుగు సినిమాగా ఇది చరిత్ర సృష్టిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here