పవన్ ఫ్యాన్స్ తెగ ఆవేశపడ్డారు.. ఉత్తి పుణ్యానికి అలీని ఆడిపోసుకున్నారు!

0
51

పవన్ కళ్యాణ్, అలీ మధ్య స్నేహం గురించి తెలుగు సినీ ప్రేక్షకులందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరి మధ్య గత ఎన్నికల్లో రాజుకున్న వివాదం ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. లైఫ్ ఇచ్చానని, స్నేహితులు కూడా పక్కన లేరని, మోసం చేసి వెళ్లారని పవన్ కళ్యాణ్ అనడం, ఎవరు ఎవరికీ లైఫ్ ఇచ్చారని అలీ రివర్స్ కౌంటర్ వేయడం అప్పట్లో సంచలనానికి దారి తీసింది. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చింది.

మొదటి నుంచి..
పవన్ కళ్యాణ్ సినిమా పరిశ్రమలోకి రాకముందు నుంచి అలీకి ఓ స్థాయి ఉండటం, చిరంజీవి ఇంటికి వెళ్లినప్పుడు ఒకటి రెండు సార్లు పలకరించడం, అలా వారిద్దరి మధ్య స్నేహం మొదలైంది. ఇక పవన్ సినిమాలన్నింటిలోనూ అలీ ఉంటాడు. అంతటి స్నేహ బంధం రాజకీయాల మూలానా నశించిపోయింది.

అలీపై ఫ్యాన్స్ గుర్రు..
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలీపై ఎంతో ప్రేమను కనబరిచేవారు. అయితే రాజకీయంగా ఇద్దరూ వేర్వేరు కావడం, పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసేలా అలీ వ్యాఖ్యలు చేయడంతో అప్పటి నుంచి ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ బర్త్ డే అడ్వాన్స్ ట్రెండ్ చేస్తున్న సమయంలో అలీని మధ్యలో ఇరికించారు.

అలీ పేరిట ట్వీట్..
పవన్ కళ్యాణ్‌కు అలీ అడ్వాన్స్ బర్త్ డే విషెస్ చెబుతున్నట్టుగా అలీ పేరటి ఓ ఫేక్ ఖాతా ట్వీట్ చేసింది. అందులో ఏముందని అంటే.. ‘వ్యక్తిత్వం లో నిన్ను ఓడించలేనప్పుడు, నీ కులం గుణం వర్ణం గురించి మాట్లాడుతారు.. ఎవరు ఎన్ని విధాలుగా విమర్శించిన చెదరని నీ నవ్వు కి నీ సహనానికి శిరస్సు వంచి నమస్కారాలు’ అని అలీ ట్వీట్ చేసినట్టుగా ఉంది.

ఆ మాటలను మర్చిపోలేరు..
మిత్రుడు కష్టాల్లో ఉన్నప్పుడు గుర్తుకు రాని నీకు.. నీ కన్న తల్లి చనిపోతే కనీసం సానుభూతి తెలపని వాడితో ఉన్నావు. పార్టీ కండువా కప్పి అవసరాలకి వాడుకొని వదిలేశావని అలీని టార్గెట్ చేశారు. జగన్ కి మద్దతు పలుకుతూ పవన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంగతులను ఏ మాత్రం మర్చిపోలేదని అలీని విపరీతంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

అది ఫేక్ అకౌంట్..
అయితే తన పేరు మీదుగా సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చపై అలీ తాజాగా మేల్కొన్నాడు. తనకు అసలు ట్విట్టర్ అకౌంటే లేదని, అది ఫేక్ అకౌంట్ అని, తనది కాదని క్లారిటీ ఇచ్చాడు. ఈ మేరకు సదరు ట్విట్టర్ అకౌంట్‌పై సైబర్ క్రైమ్ పోలీసులకు అలీ ఫిర్యాదు చేశాడు.

ఉత్తి పుణ్యానికే..
అది ఫేక్ అకౌంటా? రియల్ అకౌంటా? అసలు సదరు మనిషి ఆ కామెంట్స్ అన్నాడా? లేదా? అని ఆలోచించే తీరిక కూడా ఎవ్వరికీ ఉండటం లేదు. అలీ పేరు మీదుగా వచ్చిన ట్వీట్ మీడియలో సెన్సేషన్ అయింది. పవన్ ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ఆడుకున్నారు కూడా. కానీ అది ఫేక్ అకౌంట్ అని, ఉత్తి పుణ్యానికే అలీని ఆడిపోసుకున్నారని అందరికీ అర్థమైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here