పవన్ ని వెతకమని మనుషుల్ని పంపించారు

0
25

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్నేహితుల జాబితాలో త్రివిక్రమ్- అలీ-బండ్ల గణేష్ వంటి ప్రముఖులు ఉన్నారు. కానీ వీళ్లతో పాటు మరో చెప్పుకోదగ్గ ప్రముఖుడు ఉన్నారు. అతడే కళాదర్శకుడు ఆనంద్ సాయి. పవన్ ప్రతి సినిమాకి ఆయనే సెట్స్ నిర్మించే కళాదర్శకుడు. తమ మధ్య స్నేహం ఎంతో అమూల్యమైనదని ఆనంద్ సాయి తాజా ఇంటర్వ్యూలో తెలిపారు.

చిన్నప్పటి నుంచి ఒకరికొకరు తెలుసు. వారి మధ్య గొప్ప స్నేహం ఉంది. పవన్ కళ్యాణ్ .. ఆనంద్ సాయిలు తమ వృత్తి జీవితంలో బిజీ అవ్వటానికి ముందు దాదాపు ఎనిమిది సంవత్సరాలు కలిసి ప్రయాణించారు. అతను పవన్ తో పంచుకున్న బంధం.. అతని అభిరుచులు.. ఇతర అంశాల గురించి మాట్లాడుతూ ఆనంద్ సాయి ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.

పవన్ ఒక పుస్తకాల పురుగు అని ..అతని ఇంటిని సందర్శించినప్పుడు పుస్తకాలు అన్నీ అతని గదిలో పోగులుగా కనిపించేవాని ఆనంద్ సాయి తెలిపారు. పవన్ పూజలు చేసేవారు. ఆధ్యాత్మిక భావాలున్న వ్యక్తిగా నాకు కనెక్టయ్యారు. ఎక్కువ సమయం నేను పవన్ ఇంట్లోనే నిద్రపోయేవాడిని.. అని తెలిపారు.

పవన్ రక్షిత వాతావరణంలో పెరిగాడని.. ఆ ఏజ్ లో ప్రాపంచిక జ్ఞానం తక్కువ. చిరంజీవి భార్య సురేఖా పవన్ ను తల్లిలా చూసుకునేవారు. పవన్ అరగంట ఆలస్యంగా ఇంటికి వచ్చినా అతడిని వెతకాలని మనుషుల్ని పంపించేవారు. అంతగా ఆందోళన చెందేవారని వెల్లడించారు. పవన్ -హరీష్ చిత్రానికి ఆనంద్ సాయి కళాదర్శకత్వం వహించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here