పవన్ చెప్పినట్లు ‘గుడుంబా శంకర్’ క్లైమాక్స్ ని చేంజ్ చేశాం: డైరెక్టర్ వీర శంకర్

0
24

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వీర శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ”గుడుంబా శంకర్”. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా బ్రదర్ నాగబాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో పవన్ సరసన మీరాజాస్మిన్ హీరోయిన్ గా నటించింది. సంగీత బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమాకు పవన్ స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా మూడు పాటలకు యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేశాడు. ‘జానీ’ తో పరాజయం అందుకున్న పవన్.. ‘గుడుంబా శంకర్’ సినిమాతో విజయం అందుకుంటాడని ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అప్పటికే ఈ మూవీలో సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో 2004లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది.

‘గుడుంబా శంకర్’ అనే టైటిల్ చూసి పవన్ ఇమేజ్ కి తగ్గట్టు ఇదొక మాస్ మసాలా సినిమా అని ఊహించుకున్న ప్రేక్షకులు.. కామెడీ ఎంటర్టైనర్ అవడంతో డిజప్పాయింట్ అయ్యారు. ముఖ్యంగా క్లైమాక్స్ విషయంలో ఫ్యాన్స్ బాగా నిరాశ చెందారు. అయితే తాజాగా డైరెక్టర్ వీర శంకర్ ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా ప్లాప్ అవడానికి గత కారణాలను వివరించారు. ముందుగా పవన్ తో టైగర్ సీతారాముడు అనే సినిమాని స్టార్ట్ చేశామని.. ‘జానీ’ ప్లాప్ అవడంతో బడ్జెట్ కారణాలతో ‘గుడుంబా శంకర్’ అనే సినిమా చేశామని చెప్పారు.

”క్లైమాక్స్ లో ఓ యాక్షన్ బ్లాక్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాం. అయితే అలా అయితే రెగ్యులర్ అయిపోయిందని.. వర్కౌట్ కాదని.. నేచురల్ గా ఉండేలా వెళదామని పవన్ సూచించారు. నాకు అది నచ్చలేదు. అప్పుడు ఆయన ‘బద్రి’ నుంచి రొటీన్ కి భిన్నంగా వెళ్తున్నాను. ఇప్పుడు ఈ క్లైమాక్స్ రొటీన్ అవుతుంది. నేచురల్ గా వెళదాం. మీకు నచ్చకపోతే ఎడిటింగ్ అయ్యాక మీరు చెప్పిన క్లైమాక్స్ చేద్దాం అన్నారు. చివరకు ఎడిటింగ్ అయ్యాక థర్డ్ పర్సన్ చూసి నీ స్టైల్ లో నేచురల్ గా ఉంది అని చెప్పారు. అలానే ముందుకు వెళ్ళాం. బయటకు వెళ్ళాక కానీ ఫ్యాన్స్ సంతృప్తి చెందలేదని అర్థం అయింది” అని వీర శంకర్ చెప్పుకొచ్చాడు. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి రావడం వల్ల 16 కోట్లు కలెక్ట్ చేసిందని.. అదే ఫ్యాన్స్ కి నచ్చితే ‘ఖుషీ’ అంత వసూలు చేసేదని వీర శంకర్ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here