పవన్ కు జోడీగా మలయాళ ముద్దుగుమ్మనే ఫిక్స్ చేశారా..?

0
15

పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి హీరోలుగా మలయాళ బ్లాక్ బస్టర్ ‘అయ్యప్పనుమ్ కొశీయుమ్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ఫేమ్ సాగర్ కె.చంద్ర ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే – డైలాగ్స్ అందించడంతో పాటుగా దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇందులో హీరోయిన్లుగా ఎవరు నటిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

మలయాళ వెర్సన్ లో హీరోయిన్ల పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కానీ తెలుగు స్క్రిప్ట్ లో నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేయడమే కాకుండా.. ఫీమేల్ లీడ్ క్యారక్టర్స్ కు కూడా ఇంపార్టెన్స్ ఉండేలా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ‘ఏకే’ రీమేక్ లో నటంచే హీరోయిన్లు అంటూ అనేకమంది ముద్దుగుమ్మల పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో రానా భార్యగా ఐశ్వర్య రాజేష్ ను ఫైనలైజ్ చేసినట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. కానీ పవన్ భార్యగా ఎవరు నటిస్తున్నారనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలను నిజం చేస్తూ మలయాళ బ్యూటీ నిత్యామీనన్ ను పవన్ కు జోడీగా ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ఎలాంటి పాత్ర అయినా సహజంగా నటించే నిత్య.. తన పాత్ర ప్రాధాన్యతను బట్టే సినిమా చేయడానికి అంగీకరిస్తుంది. ఇప్పుడు ‘అయ్యప్పనుమ్ కొశీయుమ్’ తెలుగు రీమేక్ లో పవన్ కు ఫ్లాష్ బ్యాక్ పెట్టడంతో పాటుగా నిత్య పాత్ర నిడివి కూడా పెంచినట్లు టాక్. ఈ నేపథ్యంలోనే నిత్య ఈ సినిమా చేయడానికి ఒప్పుకుందని అంటున్నారు. అంతేకాదు వచ్చే వారంలో ప్రారంభమయ్యే షూటింగ్ లో అడుగుపెట్టపోతుందని సమాచారం.

కాగా #PSPKRana షూటింగ్ ఇప్పటికే 40 శాతానికి పైగా పూర్తయ్యింది. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల్లో నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్ ను జూలై 12న తిరిగి ప్రారంభించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దీని కోసం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో పోలీస్ స్టేషన్ సెట్ కూడా వేసినట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో ఏకధాటిగా చిత్రీకరణ జరిపి ఆగస్ట్ నెలాఖరుకు మొత్తం సినిమాని కంప్లీట్ చేయాలని చిత్ర యూనిట్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోందట.

ఇకపోతే మలయాళంలో బీజూ మీనన్ పోషించిన నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ నటిస్తుండగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన రిటైర్ట్ హవల్దార్ క్యారక్టర్ లో రానా కనిపించనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రసాద్ మూరెళ్ళ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here