పవన్ ఎఫెక్ట్.. ఆ డైరెక్టర్ ఫస్ట్ టైమ్ ట్రెండింగ్

0
40

స్టార్ హీరోల పుట్టిన రోజు సందర్బంగా వారి పేరుతో ట్విట్టర్ లో ట్రెండ్ నడవడం చాలా కామన్ గా చూస్తూనే ఉంటాం. కొద్ది మంది దర్శకుల బర్త్ డేల సమయంలో కూడా ట్రెండ్ అవుతూ ఉంటుంది. కాని కొత్త దర్శకుల బర్త్ డే సందర్బంగా ట్రెండ్ అవ్వడం ఇప్పటి వరకు జరిగింది లేదు. కాని ఫస్ట్ టైమ్ దర్శకుడు వేణు శ్రీరామ్ బర్త్ డే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. వకీల్ సాబ్ సినిమా తో పవన్ అభిమానుల మనసులను ఈ దర్శకుడు గెలుచుకున్నాడు. దాంతో పవన్ అభిమానులు హ్యాపీ బర్త్ డే మాస్ గాడ్ వేణు శ్రీరామ్ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.

పింక్ సినిమా ను మాస్ సినిమాగా మార్చి పవన్ ఇమేజ్ కు తగ్గట్లుగా మంచి మెసేజ్ ను ఏమాత్రం పాడు చేయకుండా వకీల్ సాబ్ ను రూపొందించాడు. చేసిన సినిమాలు తక్కువే అయినా కూడా వకీల్ సాబ్ తో ఒక్కసారిగా అందరి దృష్టిని వేణు శ్రీరామ్ ఆకర్షించాడు. పవన్ తో వకీల్ సాబ్ ఎఫెక్ట్ కారణంగా ఆయన బర్త్ డే సందర్బంగా ట్రెండ్ అవుతున్నాడు. పవన్ కళ్యాణ్ తో మళ్లీ ఈయన సినిమా చేసే అవకాశంను దక్కించుకున్నాడనే వార్తలు వస్తున్నాయి.

వకీల్ సాబ్ సక్సెస్ తో అల్లు అర్జున్ తో ఐకాన్ సినిమా ను పట్టాలెక్కించే అవకాశం ఉందని అంటున్నారు. బన్నీ గతంలోనే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ చేసేందుకు ఓకే చెప్పాడు. కాని కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయ్యింది. ఇప్పుడు ఆ సినిమా ను పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పుష్ప సినిమా తర్వాత వేణు శ్రీరామ్ కు బన్నీ డేట్లు ఇస్తాడని అంటున్నారు. ఐకాన్ కూడా సక్సెస్ అయితే ఇక ముందు వరుసగా తన బర్త్ డే రోజున సోషల్ మీడియాలో వేణు శ్రీరామ్ ట్రెండ్ అవ్వడం ఖాయం గా అభిమానులు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here