న్యూ లుక్ లో ఏమున్నాడ్రా బాబు..!

0
14

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత అండగాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వయసు పెరుగుతున్న కొద్దీ మరింత అందంగా తయారవడం మహేష్ స్పెషలిటీ. ఏజ్ అనేది ఆయనకు జస్ట్ నెంబర్ మాత్రమే. అందుకే నాలుగు పదుల వయస్సు దాటినా ఇంకా ఇరవై ఏళ్ల కుర్రాడిలా హ్యాండ్సమ్ లుక్ లో కనిపిస్తుంటారు. ఆయన అందం వెనుక రహస్యం ఏంటా అని అందరూ ఆశ్చర్యపడుతుంటారు. ఇప్పుడు తాజాగా బయటకు వచ్చిన మహేష్ బాబు ఫోటో చూస్తే ఎవరైనా ఆయన లుక్ కి ఫిదా అవ్వాల్సిందే. ఏమున్నాడురా బాబు అంటూ కామెంట్స్ చేసేలా ఆ ఫోటో ఉంది.

మహేష్ బాబు తన గారాల పట్టి సితారతో కలిసి తీసుకున్న సెల్ఫీ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో సితార క్యూట్ స్మైల్ తో ముద్దుగా ఉండగా.. బ్లాక్ గ్లాసెస్ పెట్టుకొని మహేష్ స్టైలిష్ గా ఉన్నాడు. ఎప్పుడూ క్లీన్ షేవ్ తో యువరాజులా కనిపించే సూపర్ స్టార్.. ఇందులో లాంగ్ హెయిర్ – గడ్డం మీసాలతో కనిపించి అదరగొడుతున్నాడు. కోవిడ్ నేపథ్యంలో ప్రస్తుతం ఇంటికే పరిమితమైన మహేష్ న్యూ లుక్ లో ఇంకాస్త అందంగా కనిపిస్తున్నాడు. ఇదే లుక్ రాబోయే సినిమాల్లో మెయింటైన్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఇకపోతే మహేష్ ప్రస్తుతం పరశురామ్ పేట్ల దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు. ఇందులో వింటేజ్ మహేష్ ని చూడబోతున్నట్లు హింట్ ఇచ్చాడు. వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమా షూటింగ్ కరోనా ప్రభావంతో నిలిపివేశారు. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేయనున్నాడు. అలానే దర్శకులు రాజమౌళి – అనిల్ రావిపూడి ప్రాజెక్ట్స్ కూడా మహేష్ లైనప్ లో ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here