నోరు జారిన ఆర్జీవీ.. కోటిన్నర నష్టం!

0
23

రామ్ గోపాల్ వర్మ ప్రతీ విషయంలోనూ కాలిక్యులేటెడ్ గా ఉంటారు. ఏ విషయం చెప్పాలో.. ఎంత వరకు చెప్పాలో.. దేనికి రియాక్ట్ కావాలో.. దేనికి సైలెంట్ గా ఉండాలో.. ఇలా అన్ని విషయాల్లోనూ ప్లాన్డ్ గా వ్యవహరిస్తారు. అలాంటి ఆర్జీవీ.. ఓ సారి టంగ్ స్లిప్ అయ్యాడట. దాని వల్ల నిర్మాత ఏకంగా కోటిన్నర రూపాయలు నష్టపోయాడట!

ప్రముఖ నిర్మాత రామ సత్యనారాయణ 2014లో ‘ఐస్ క్రీమ్’ అనే చిత్రం నిర్మించారు. ఆర్జీవీ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. థియేట్రికల్ రిలీజ్ విషయంలో ఇబ్బందేమీ లేదు. కానీ.. శాటిలైట్ హక్కుల విషయంలోనూ తిప్పలు వచ్చి పడింది. ఈ సినిమాను కొనడానికి జెమిని టీవీ వాళ్లు ముందుకు వచ్చారట.

బేరసారాలు కొనసాగిన తర్వాత రూ. కోటి 20 లక్షలకు ఈ సినిమాను కొనడానికి ఒప్పందం కుదిరిందట. అయితే.. ఆర్జీవీ అనుకోకుండా ఈ సినిమా పెట్టువడి కేవలం 2.5 లక్షలు మాత్రమేనని చెప్పాడట. దీంతో.. జెమిని టీవీ వాళ్లు ఆలోచనలో పడిపోయారట.

ఇంత తక్కువ బడ్జెట్ తో తీసిన సినిమాకు.. అంత మొత్తం పెట్టామా? అనుకున్నారట. చివరకు ఆ డీల్ నే క్యాన్సిల్ చేశారట. అయితే.. వాస్తవం ఏంటో కూడా చెప్పారు నిర్మాత. ఆ సినిమా 2.5 లక్షల పెట్టుబడితో మొదలైన మాట వాస్తవమేనట. కానీ.. హీరో హీరోయిన్లు టెక్నీషియన్లు అందరూ సినిమా తర్వాత వచ్చే లాభాలనే పారితోషికంగా తీసుకోవాలని అనుకున్నారట. ఈ విషయం చెప్పినా కూడా జెమిని టీవీ వాళ్లు వినలేదట. ఆ విధంగా నష్టం జరిగిందని చెప్పారట రామ సత్యానారయణ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here