నోరు జారింది.. చిన్నప్పుడు తెలియక చేశానంటూ కవరింగ్

0
30

సెలబ్రెటీలు మాట్లాడేప్పుడు లేదా సోషల్ మీడియాలో ఏమైనా ట్వీట్ చేసే సమయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న తప్పు దొర్లినా కూడా వారిని ట్రోల్ చేసేందుకు చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. చిన్న తప్పు చేసినా లేదా నోరు జారినా కూడా తీవ్ర విమర్శలను ఎదుర్కన్న సెలబ్రెటీలను గతంలో చాలా సార్లు చాలా మందిని మనం చూశాం. ఇంటర్వ్యూల సమయంలో నోరు జారి ఆ తర్వాత నేను అలా అనలేదు నా మాటలు వక్రీకరించారు అంటూ నెత్తి నోరు కొట్టుకున్న వారు చాలా మంది ఉన్నారు. తాజాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ హూమా ఖురేషి కూడా ఒక ఇంటర్వ్యూలో నోరు జారి ఆ తర్వాత కవర్ చేయలేక చాలా ఇబ్బంది పడింది.

సాజిత్ ఖాన్.. రితేష్ హోస్ట్ లుగా వ్యవహరిస్తున్న యారోంకి బారాత్ షో లో ఇటీవల హూమా ఖురేషి పాల్గొన్నారు. ఆ సమయంలో పలు విషయాలను షేర్ చేసుకున్న హూమా హోస్ట్ లు అడిగిన ఒక ప్రశ్నకు సచిన్ టెండూల్కర్ పోస్టర్ ను చింపేశానంటూ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత అది వివాదం అవుతుందని భావించిందో ఏమో కాని వెంటనే కవరింగ్ చేసేందుకు ప్రయత్నించింది. చిన్న తనంలో సోదరుడితో గొడవ పడ్డ సమయంలో కోపంలో తెలియక సచిన్ టెండూల్కర్ పోస్టర్ లను చింపి పడేశానంటూ పేర్కొంది.

సచిన్ అంటే క్రికెట్ అభిమానులకు దేవుడు. అలాంటి సచిన్ ను విమర్శిస్తే ఎవరూ ఊరుకోరు. అలాంటిది ఏకంగా ఆయన పోస్టర్ ను చించేశానంటే ఊరుకుంటారా అందుకే వెంటనే తేరుకున్న హూమా ఖురేషి చిన్నతనంలో ఏదో తెలియక చేశానంటూ చెప్పే ప్రయత్నం చేసింది. కాని ఆమె పోస్టర్ చించింది చిన్నతనంలో కాదని ఇంటర్వ్యూ మరింత ముందుకు వెళ్లిన సమయంలో అర్థం అయ్యింది. కవర్ చేసేందుకు చిన్నతనంలో తెలియక అంటూ కవరింగ్ చేసిందని క్లారిటీగా అర్థం అవుతుంది. బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకు పోతున్న ఈ అమ్మడు సినిమాల్లోనే కాకుండా వెబ్ సిరీస్ లు మరియు ఇతర ప్లాట్ ఫామ్ లపై కూడా సందడి చేస్తూనే ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here