నేను హీరో అవుతానని అంటే నాన్న షాక్ అయ్యారు

0
38

ప్రభాస్ అసలు నటుడు అవ్వాలనే అనుకోలేదు. కానీ అతడిని హీరోని చేయాలని తపించారు తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు. ఆయన మనసులో ఎప్పుడూ ఉండేది. దానిని ప్రభాస్ కి చెబితే అనాసక్తిగా ఉండేవాడు. కానీ 18-19 వయసులో అనూహ్యంగా తన తండ్రి వద్దకు వెళ్లి తాను నటుడిని అవుతానని ప్రభాస్ మొదటి సారి చెప్పారట. ఆ మాట విని ఆయన షాక్ తిన్నారు. ఈ  విషయాలన్నీ ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

ప్రభాస్ సిగ్గరి. అందుకే నటుడు కావాలని అనుకోలేదు. అది ఎల్లపుడూ చివరి ఆప్షన్ అని అనుకునేవాడట. కానీ తన తండ్రి దివంగత నిర్మాత పంపిణీదారుడు అయిన సూర్య నారాయణరాజు మాత్రం తన కుమారుడు పెద్ద స్టార్ అవుతాడని నమ్మేవారట. ప్రభాస్ కెమెరాను ఎదుర్కోవటానికి చాలా సిగ్గుపడుతున్నాడని చెప్పినప్పుడు .. డబుల్ టేక్ తో అయినా ఓకే .. కాబట్టి దీనిని ఒకసారి ప్రయత్నించండి అని అన్నారట.

సినిమాల్లో నటించడానికి చాలా సిగ్గుపడ్డాను. కానీ అది నాకు పని చేస్తుందని నాన్న భావించారు. నటనలోకి రావడం గురించి ఆలోచించడానికి నాకు చాలా సమయం పట్టింది. నా కుటుంబ నేపథ్యం దృష్ట్యా చిన్నతనంలో నటుడవుతావా అని నన్ను అడిగినప్పుడు నేను నెగెటివ్ గా సమాధానం చెప్పేవాడిని అని ప్రభాస్ అన్నారు.

కేవలం ప్రభాస్ తండ్రి మాత్రమే కాదు.. పెదనాన్న కృష్ణరాజు కూడా తాను హీరో కావాలని పట్టుబట్టారట. కృష్ణం రాజు పెద్ద స్టార్ కాబట్టి చాలా ముందుగానే ప్రభాస్ హీరో అవుతాడని చాలా మంది ఊహించారు. కానీ ప్రభాస్ దానిని నిజం చేయడానికి చాలా సమయం తీసుకున్నాడు. “నటనను కొనసాగించాలనుకునే నా సోదరులు కొందరు ఎప్పుడూ సినిమాలు తీస్తూ ప్రజలను కలుస్తూ ఉండేవారు. ఇవన్నీ చేయడం గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. సినిమాలు చేయడం నా ఆలోచనల్లో చివరిది అని ప్రభాస్ అన్నారు.

ప్రభాస్.. ఉప్పలపాటి సూర్యనారాయణరాజు- శివ కుమారి దంపతులకు 1979 అక్టోబర్ 23న జన్మించాడు. పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు తన కుటుంబ స్వగ్రామం. తన తల్లితండ్రులకు ఉన్న సంతానంలో రెండోవాడు. అతనికి ఒక సోదరుడు ప్రబోధ్.. ఒక చెల్లెలు ప్రగతి ఉన్నారు. నటులు గోపిచంద్- అల్లు అర్జున్- రామ్ చరణ్- రానా దగ్గుబాటి- మంచు మనోజ్ కుమార్ ప్రభాస్ కు మంచి స్నేహితులు. ప్రభాస్ తన ప్రాథమిక విద్యను డి.ఎన్.ఆర్ స్కూల్ భీమవరంలో పూర్తిచేశారు. బి .టెక్ ఇంజినీరింగ్ కాలేజ్ శ్రీ చైతన్య హైదరాబాద్ లో పూర్తిచేశారు. ఇక ఈశ్వర్ సినిమాతో హీరో అయిన ప్రభాస్ ఇంతింతై పెద్ద స్టార్ అయ్యారు. బాహుబలి చిత్రంతో దేశంలో సంచలనం సృష్టించారు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యారు. అతడిని హీరోని చేయాలనే ఆలోచన ఆయన తండ్రి కి లేకపోయి ఉంటే ఏమయ్యేవాడో..అభిమానులు ఊహించలేరు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here