నేను ప్రాణాలతోనే ఉన్నానుః నటుడు

0
18

సోషల్ మీడియాలో ఫేక్ వార్తలకు కొదవే లేకుండా పోయింది. ఆకతాయి బ్యాచ్ ఇలాంటి వార్తలను ప్రచారం చేయడమే పనిగా పెట్టుకుంది. ఆ మధ్య లోక్ సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ చనిపోయినట్టు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సింగర్ లక్కీ అలి కూడా చనిపోయినట్టు కథనాలు వచ్చాయి. దీంతో.. తాము బతికే ఉన్నామంటూ వారు నిరూపించుకోవాల్సి వచ్చింది.

తాజాగా.. ‘శక్తిమాన్’ ఫేమ్ బాలీవుడ్ నటుడు ముఖేష్ ఖన్నా చనిపోయారంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ముఖేష్ ఖన్నాకు కరోనా సోకిందని ఆయన చనిపోయారని ప్రచారం చేశారు. ఈ విషయం ఆయన వరకూ వెళ్లడంతో ముఖేష్ స్పందించారు.

”మీ ఆశీర్వాదాల వల్ల నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. నేను కొవిడ్ బారిన పడి ఆసుపత్రిలో చేరానని వస్తున్న వార్తలు అవాస్తవం. నాకు అసలు కరోనా వైరస్ సోకలేదు. ఈ పుకార్లు ఎవరు సృష్టిస్తున్నారో.. ఏ ఉద్దేశంతో ప్రచారం చేస్తున్నారో తెలియట్లేదు. వారిని ఏం చేస్తే ఇలాంటివి వదిలేస్తారు? సోషల్ మీడియా వల్ల కూడా ఈ సమస్య వస్తోంది. ఇలా ఫేక్ న్యూస్ లతో జనం ఎమోషన్స్ తో ఆడుకోవడం దారుణం. ఇలాంటి వారిని శిక్షించి తీరాలి” అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here