నెటిజన్స్ ప్రశ్నలకు స్పందించిన సురేఖావాణి కూతురు.. ఏం చెప్పిందంటే??

0
20

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి. కెరీర్ పరంగా వందల సినిమాలలో నటించిన సురేఖవాణి.. ఎక్కువగా తల్లి – వదిన – అక్క – డాక్టర్ – నర్స్ ఇలాంటి పాత్రలలో ఎక్కువగా కనిపించింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినప్పటికి సురేఖావాణి ఇండస్ట్రీలో ఆమె క్రేజ్ మాములుగా లేదు. ఎక్కువగా చీరకట్టుతో ట్రెడిషనల్ రోల్స్ చేసిన సురేఖా.. నిజజీవితంలో ఆమెకు నచ్చిన లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ఆమెలో నేటితరం మోడ్రన్ మదర్ కూడా ఉంది. అప్పుడప్పుడు స్టైలిష్ ఫోటోషూట్స్ తో సర్ప్రైజ్ చేస్తుంటుంది.

ఎందుకంటే సురేఖావాణి సోషల్ మీడియాలో చేసే సందడి చూస్తే ఆమె క్రేజ్ అర్ధమవుతుంది. ఈ మధ్యకాలంగా సినిమాలలో తక్కువగా కనిపిస్తోంది కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె తన కూతురుతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తోంది. అయితే సోషల్ మీడియాలో మోడ్రన్ డ్రెస్సులతో అలరించే సురేఖావాణి ఇంస్టాగ్రామ్ ఫోటోస్ వీడియోస్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. సురేఖావాణితో పాటు రెగ్యులర్ గా ఆమె కూతురు సుప్రితను కూడా మనం చూడవచ్చు. కూతురిని ఎంత మోడ్రన్ గా పెంచుతుందో.. సురేఖ కూడా అంతే మోడ్రన్ అనిపించుకుంటుంది.

అయితే ఇటీవల సోషల్ మీడియా బాధితులలో సురేఖ కూడా ఒకరు. వీరిపై ఎల్లప్పుడూ ఏదొక గాసిప్ లేదా న్యూస్ హాట్ టాపిక్ అవుతుంటుంది. ఇదివరకే భర్తను కోల్పోవడమే జీవితంలో చాలా పెద్దలోటు అని చెప్పిన సురేఖావాణి.. భర్త మరణం గురించి ఇటీవలే ఆమె కూతురు చెప్పిందట. తన తండ్రితో అనుబంధం ఎంతో బాగుండేదని కానీ ఎక్కువగా నడిచే అలవాటు కారణంగా కాళ్ళలో ఇన్ఫెక్షన్ అయిందని.. చికిత్స చేసాక కొంతకాలానికి మళ్లీ ఇన్ఫెక్షన్ అవ్వడం – హార్ట్ ఎటాక్ కారణంగా తండ్రిని కోల్పోయినట్లు సుప్రిత చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సుప్రిత పలు షార్ట్ ఫిలిమ్స్ – ప్రోగ్రాంస్ చేస్తుందట. మరి సినిమా ఎంట్రీ ఎప్పుడని సురేఖావాణి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here