నిన్నటి వరకు ‘వకీల్’ ట్రెండ్.. ఇప్పుడు ‘ఏజెంట్’ ట్రెండ్..!

0
26

టాలీవుడ్ లో ఈ మధ్య నల్ల కోటు ట్రెండ్ నడిచిందని చెప్పవచ్చు. కరోనా పాండమిక్ తర్వాత వచ్చిన చాలా సినిమాలన్నీ దాదాపుగా కోర్టు డ్రామా నేపథ్యంలో వచ్చినవే. వాటిలో మన హీరోహీరోయిన్లు లాయర్ కోటు ధరించి ప్రేక్షకులను అలరించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రంలో ఆయన సత్యదేవ్ అనే వకీల్ గా నటించాడు. అలానే ‘నాంది’ ‘జాతిరత్నాలు’ సినిమాల్లో హీరోయిన్లు నల్ల కోటు ధరించి వాదించారు. ఇప్పుడు డైరెక్టర్ మారుతి – గోపీచంద్ కాంబినేషన్ లో రూపొందుతున్న ‘పక్కా కమర్షియల్’ సినిమాలో హీరోహీరోయిన్లు లాయర్ పాత్రలు పోషిస్తున్నారని తెలుస్తోంది. ఇక ‘తిమ్మరుసు’ చిత్రంలో సత్యదేవ్ కూడా లాయర్ సాబ్ గా కనిపించనున్నాడు. అయితే ఇప్పుడు మరో కొత్త ట్రెండ్ వచ్చింది.

నిన్నటి వరకు లాయర్ సాబ్ ట్రెండ్ ఉంటే.. ఇప్పుడు దాంతో పాటుగా ఏజెంట్ ట్రెండ్ వచ్చింది. అఖిల్ అక్కినేని – సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘ఏజెంట్’. ఇందులో టైటిల్ కి తగ్గట్లే అఖిల్ ఒక సీక్రెట్ ఏజెంట్ గా కనిపించనున్నాడు. అలానే సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రానున్న ‘#SSMB28’ సినిమా కథ రా ఏజెంట్ నేపథ్యంలో ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే మహేశ్ ఇందులో ఏజెంట్ గా నటిస్తున్నట్లే. ఇక యువ హీరో కార్తికేయ కూడా తన అప్ కమింగ్ మూవీ ‘#KG7’ లో ఎన్ఐఏ ఏజెంట్ రోల్ లో నటిస్తున్నాడు. టాలెంటెడ్ యంగ్ హీరో అడివి శేష్ టైటిల్ రోల్ ప్లే చేస్తోన్న ‘మేజర్’ సినిమాలో శేష్ స్పెషల్ కమాండర్ గా కనిపించనున్నాడు. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్ అందుకున్న ‘వైల్డ్ డాగ్’ చిత్రంలో కింగ్ నాగార్జున ఎన్ఐఏ ఏజెంట్ గా కనిపించి అలరించాడు. ఇదంతా చూసుకుంటే ఇప్పుడు టాలీవుడ్ లో మళ్లీ ఏజెంట్ ట్రెండ్ నడుస్తుందనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here