నిజ జీవిత పాత్రనే తెరపైనా పోషించిందట

0
17

రకుల్ టాలీవుడ్ కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ ని విడిచిపెట్టకుండా కెరీర్ బండిని నడిపించేస్తున్న సంగతి తెలిసిందే. అన్ని భాషల అభిమానులకు నిరంతరం టచ్ లో ఉంటోంది. ప్రస్తుతం ఈ పంజాబీ బ్యూటీ నటించిన `సర్ధార్ కా గ్రాండ్సన్` ఓటీటీలో రిలీజవుతోంది.

“తన అమ్మమ్మ కోరికను నెరవేర్చాలని కోరుకునే కుర్రాడి కథ ఇది“ అర్జున్ కపూర్ పోషించిన అమ్రీక్ పాత్ర ఆసక్తికరంగా ఉంటుందట. ఈ చిత్రం మే 18న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. అయితే ఇందులో రకుల్ ఎలాంటి పాత్రలో నటించింది? తనకు పేరొస్తుందా? అంటే.. అవుననే కాన్ఫిడెన్స్ ని వ్యక్తం చేస్తోంది.

ఈ చిత్రంలో తన నిజజీవిత పాత్రనే తెరపై చూపించారట. రాధగా కనిపిస్తానని.. రాధ `వాకింగ్ టాకింగ్ టైమ్ టేబుల్` టైప్ అని చెప్పింది. ఆర్గనైజ్డ్ గా జీవించే అమ్మాయి పాత్ర అది. నిజ జీవితంలో ఎలా ఉంటుందో అదే పాత్రను తెరపై పోషించిందట.

దర్శకులు కాశ్వి (నాయర్) ఆ పాత్రను వివరించినప్పుడు.. రాధగా రకుల్ అయితేనే బావుంటుందని అన్నారట. నిజజీవితంలోనూ నేను టైమ్ విషయంలో సమయస్ఫూర్తితో ఉంటాను. చేసే పనుల్ని క్రమబద్ధంగా చేయడానికి ఇష్టపడతాను. రాధ పాత్రతో చాలా సంబంధం కలిగి ఉన్నాను.. అని తెలిపారు. వైష్ణవ్ తేజ్ – క్రిష్ కాంబినేషన్ మూవీలో రకుల్ ఓ విలేజీ గాళ్ పాత్రను పోషించిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here