నా బాయ్ఫ్రెండ్తో బ్రేకప్ అలా జరిగింది.. ఏడువని రోజంటూ లేదు.. దివి వద్యా ఎమోషనల్

0
45

బిగ్‌బాస్ రియాలిటీ షో నుంచి దివి వద్యా ఎలిమినేట్ కావడం ప్రేక్షకులను షాక్ గురిచేసింది. ఇంటిలో జెన్యూన్ ఆడుతున్న కంటెస్టెంట్ బయటకు రావడంతో ఆమె కూడా ఊహించలేకపోయింది. బిగ్‌బాస్ ఎలిమినేట్ అయిన తర్వాత మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ వ్యక్తిగత, ప్రొఫెషనల్ తన అనుభవాలను చెప్పుకొన్నారు. బిగ్‌బాస్ అనుభవాలను దివి చెబుతూ..

 ప్రేక్షకులు కురిపిస్తున్న ప్రేమను..

బిగ్‌బాస్ ఇంటి నుంచి రావడం బాధ కలిగించలేదు. ఎందుకంటే ఆ ఇంటి నుంచి మా ఇంటికి వెళ్తున్నాననే ఫీలింగ్ అనిపించింది. కాకపోతే ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రేక్షకులు, అభిమానుల నుంచి వస్తున్న మెసేజ్‌, ప్రేమ చూసి నేను చెప్పలేనంత ఆనందంలో మునిగిపోయాను. ప్రేక్షకుల స్పందనను ఊహించలేదు అని దివి అన్నారు.

దీపికా పదుకోన్‌తో పోల్చితే…

 నాకు దీపిక పదుకోన్ అంటే ఇష్టం. ఆమెను నన్ను పోల్చుతూ కామెంట్ చేస్తుంటే హ్యాపీగా ఉంది. ఆమె లానే నేను ప్రేమ వివాహం చేసుకోవాలనుకొన్నాను. కానీ బ్రేకప్ జరిగింది. కానీ ఇప్పుడు అమ్మా, నాన్న మెచ్చిన వ్యక్తినే నేను పెళ్లి చేసుకొంటాను. అది ప్రేమ వివాహమైనా.. అరెంజ్‌డ్ అయినా వారి ఇష్టప్రకారమే చేసుకొంటాను అని అన్నారు.

ప్రియుడితో ప్రేమ విఫలం అలా..

నా బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ జరిగింది. వాళ్ల బ్రదర్ చనిపోవడం వల్ల నాకు దూరం అయ్యాడు. బిజినెస్ చూసుకోవాల్సి రావడంతో నన్ను పక్కన పెట్టారు. నన్ను పక్కన పెట్టడం వల్ల నేను బాధపడ్డాను. ప్రతీ రోజు ఏడ్చాను. ఏడువని రోజు అంటూ లేదు. మెల్లమెల్లగా అభిప్రాయ బేధాలు వచ్చాయి అని దివి చెప్పారు.

నా స్నేహితుడి మరణంతో జీవితం మారిపోయింది

 నా బాయ్‌‌ఫ్రెండ్ బ్రదర్ నాకు మంచి స్నేహితుడు. ఆయన మరణంతో నేను చాలా బాధపడ్డాను. నా స్నేహితుడి మరణం నా లైఫ్‌ను మార్చేసింది. నా బాయ్‌ఫ్రెండ్‌, నేను జెన్యూన్‌గా ఉన్నాం. మా ప్రేమ పట్ల మేమిద్దరం అంకితభావంతో ఉన్నాం. పరిస్థితులు మమల్ని దూరం చేసింది. నేను మోడలింగ్, సినిమాలు వైపు వెళ్లడం, బిజీగా మారడం వల్ల నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను అంటూ దివి వద్యా వెల్లడించారు.

ప్రేమ అనేది ఓ ఫీలింగ్

 ప్రేమ అనేది ఓ ఫీలింగ్. అది మాటల్లో చెప్పలేం. మనకు నచ్చిన వ్యక్తి నుంచి ఏదైనా మెసేజ్ వస్తే బాడీలో హ్యాపీ హార్మోన్ ప్రవేశిస్తుంది. అలాంటి సమయంలో ఆనందం రెట్టింపు అవుతుంది. అది ప్రియుడి గానీ, ఫ్యామిలీ మెంబర్స్ గాని పర్వాలేదు. నాకు సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న వ్యక్తి , అలాగే మంచి వంట చేసేవాడు అంటే నేను ఇష్టపడుతాను అని దివి చెప్పారు.

నా బాయ్‌ఫ్రెండ్‌కు చేరువ కాలేను నా బాయ్‌ఫ్రెండ్ మళ్లీ తిరిగి నా వద్దకు వస్తే నేను మళ్లీ అతడితో అఫైర్ కొనసాగించను. ఎందుకంటే ఒక్కసారి విభేదాలు వచ్చిన తర్వాత మళ్లీ కొనసాగడం కుదరదు. మేము ఇప్పటికి మాట్లాడుకొన్నప్పటికి.. హాయ్ బాయ్ వరకే పరిమితం అవుతాను. అంతకంటే అతడితో ఎలాంటి రిలేషన్ పెట్టుకొను అని దివి చెప్పింది.

 నా బాయ్‌ఫ్రెండ్‌కు చేరువ కాలేను

 నా బాయ్‌ఫ్రెండ్ మళ్లీ తిరిగి నా వద్దకు వస్తే నేను మళ్లీ అతడితో అఫైర్ కొనసాగించను. ఎందుకంటే ఒక్కసారి విభేదాలు వచ్చిన తర్వాత మళ్లీ కొనసాగడం కుదరదు. మేము ఇప్పటికి మాట్లాడుకొన్నప్పటికి.. హాయ్ బాయ్ వరకే పరిమితం అవుతాను. అంతకంటే అతడితో ఎలాంటి రిలేషన్ పెట్టుకొను అని దివి చెప్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here