‘నా బతుకు నేను బతుకుతా..’ కమెడియన్ ప్రియదర్శి వైరల్ పోస్ట్!

0
18

టాలీవుడ్ కమెడియన్ ప్రియదర్శి తాజాగా ఇంటరెస్టింగ్ ట్విట్టర్ పోస్టు పెట్టాడు. ప్రస్తుతం కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రతిరోజూ జనాలు ఎంతగా బాధలు పడుతున్నారో.. ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు అనే విషయం తెలిసిందే. అయితే ఇప్పుడున్నటువంటి కోవిడ్ పరిస్థితిలో సామాన్యులు ఎలాంటి పొరపాటు చేసినా.. అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లే అవుతుంది. ప్రస్తుతం మాస్క్ – సోషల్ డిస్టెన్స్ అనేది కంపల్సరీ. లేకపోతే లైఫ్ రిస్క్ లో పడిపోతుంది. ఈ విషయాన్నీ తన ఫేమస్ డైలాగ్ తో సింక్ చేసి ప్రియదర్శి సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేసాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి కరోనా కల్లోలం మొదలైనప్పటి నుండి సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు ఏదొక విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ కరోనా పై అవగాహనా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.

కానీ ఎలా పోయేవారు అలా పోతూనే ఉన్నారు. తాజాగా ప్రియదర్శి ట్విట్టర్ వేదికగా.. రెండు ఫోటోలు పోస్ట్ చేసాడు. ఒకటి మాస్క్ లేకుండా.. మరొకటి మాస్క్ ధరించి ఉన్నాయి. అందులో మాస్క్ లేకుండా ఉన్న ఫోటో పై ‘నా సావు నేను చస్తా.. నీకెందుకు?’ అని ఉంది. అలాగే మరో మాస్క్ ధరించిన ఫోటో పై ‘నా బతుకు నేను బతుకుతా.. నా అవసరం’ అంటూ పోస్ట్ చేసాడు. అంటే ఈ పోస్ట్ ద్వారా ప్రియదర్శి ప్రస్తుతం మాస్క్ ఎంత అవసరం అనేది సందేశం చెప్పినట్లు అర్ధమవుతుంది. అందుకే ఇప్పుడు ఆ పోస్ట్ వైరల్ అవడమే కాకుండా ప్రియదర్శికి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఇటీవలే ప్రియదర్శి నాంది – జాతిరత్నాలు – మెయిల్ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. అలాగే ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నట్లు సమాచారం. త్వరలో షూటింగ్స్ మొదలైతే మళ్లీ సినిమాలతో బిజీ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఓ మంచి పోస్ట్ తో ప్రియదర్శి మెప్పు పొందుతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here