నా ఫస్టు మూవీ ఎలా ఉంటుందంటే .. దగ్గుబాటి అభిరామ్!

0
26

దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వెంకటేశ్ సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్నారు. ఇప్పటికీ ఆయన జోష్ తగ్గలేదు .. ఆయన సినిమాలకి వసూళ్లు తగ్గలేదు. అలా ఆయన ఒక వైపున దూసుకుపోతుండగానే రానా రంగంలోకి దిగాడు. విభిన్నమైన పాత్రలతో రానా తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉండగానే ఆయన తమ్ముడు అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకి తేజ దర్శకత్వం వహిస్తున్నాడు.

తాజా ఇంటర్వ్యూలో అభిరామ్ మాట్లాడుతూ తన గురించిన విషయాలను షేర్ చేసుకున్నాడు. “మొదటి నుంచి కూడా నేను మా తాతగారితో కలిసి షూటింగ్ లొకేషన్స్ కి ఎక్కువగా వెళుతూ ఉండేవాడిని. అలా సినిమాలు .. షూటింగులు చూస్తూ పెరిగాను. దర్శకుడు తేజగారు కనిపించినప్పుడల్లా నేను హీరోను అయితే నా మొదటి సినిమా మీతోనే చేస్తాను అనేవాడిని. ఎందుకంటే ఆయన చాలామంది హీరోలను తెరకి పరిచయం చేశారు. కొత్త హీరోల నుంచి యాక్టింగ్ రాబట్టుకోవడం ఆయనకి బాగా తెలుసు.

నా కోసమే ఆయన ఒక కథను రెడీ చేశారు .. ఆ కథ మా నాన్నగారితో పాటు మా అందరికీ నచ్చింది. ఇందులో లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ .. ఇలా అన్నీ ఉంటాయి. అన్నివర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రాసిన కథ. కోవిడ్ కారణంగా ఈ సినిమాకి సంబంధించిన పనులు ఆగిపోయాయి. ఆ తరువాత ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంది. గతంలో నేను కాస్త దూకుడుగా ఉండేవాడిని .. ఇప్పుడు తగ్గించాను. మా తాతగారు కోరుకున్నట్టుగా .. మా నాన్నగారు ఆశించినట్టుగా ముందుకు వెళ్లాలని అనుకుంటున్నాను” అని చెప్పుకొచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here