నా ప్రాణాలకు ముప్పు.. సినీ హీరోపై సంచలన ఆరోపణలు.. ఇన్స్టాగ్రామ్లో బాధితురాలి పోస్ట్!

0
11

గ్యాంగ్ రేప్ కేసులో బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీ మెడకు ఉచ్చు బిగుస్తుందా అనే అనుమానం కలుగుతున్నది. మోడల్ అపర్ణా ఫిర్యాదు మేరకు ఫోటోగ్రాఫర్ జూలియన్, కోల్‌స్టన్, మరో ఏడుగురిపై రేప్‌ కేసు నమోదు చేసి విషయం తెలిసిందే. గత మే 26వ తారీఖున జాకీ భగ్నానీతోపాటు పలువురిపై కేసు నమోదు చేసిన తర్వాత మోడల్ తాజాగా ఇన్స్‌టాగ్రామ్‌లో చేసిన పోస్టు వైరల్‌గా మారింది.

చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ

నాపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన తర్వాత వాళ్లు నన్ను బెదిరిస్తున్నారు. ఇండస్ట్రీలోని కొందరు పెద్దలు చంపేస్తామని నన్ను బెదిరిస్తున్నారు. చెప్పడానికి వీలు లేకుండా ఫోటోలు, వీడియోలు పంపిస్తున్నారు. నేను వందలాది మందిని ఫోన్‌లో బ్లాక్ చేశాను. అయినా ఫేక్ అకౌంట్లతో ఇంకా వేధిస్తున్నారు అని అపర్ణా ఇన్స్‌టాగ్రామ్‌ పోస్టులో పేర్కొన్నారు.

ఫిర్యాదులతో విసిగిపోయా

అయినా ఫేక్ అకౌంట్లు సృష్టిస్తూ నాకు బూతు చిత్రాలు, దారుణమైన వీడియోలు పంపిస్తున్నారు. నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. నీవు ఉండే ప్రాంతంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయమంటున్నారు. అయితే నాకు పోలీస్ స్టేషన్ల చుట్టు తిరిగే ఓపిక, సహనం నాకు లేదు. ఇప్పటికే మూడు వారాలుగా నేను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి విసిగిపోయాను అంటూ అపర్ణా వెల్లడించారు.

నా లైఫ్‌కు ఏదైనా జరిగితే..

ఇలాంటి పరిస్థితుల మధ్య నేను అందరికి ఓ విషయాన్ని చెప్పదలచుకొన్నాను. నా విషయంలో కోర్టు తీర్పుకు ముందు గానీ, ఆ తర్వాత గానీ నాకు జరగకూడని సంఘటనలు ఏవైనా జరిగితే అందుకు కారణం గురుప్రీత్ సింగ్, షీల్ గుప్తా, నిఖిల్ కామత్, గుర్జోత్ సింగ్, అజిత్ థాకూర్, కృష్ణన్ కుమార్, విష్ణు ఇందూరి, జాకీ భగాన్నీ తదితరులు అవుతారు అని అపర్ణా తన పోస్టులో పేర్కొన్నారు.

మానసికంగా, శారీరకంగా అంటూ

ఇప్పటి వరకు బాలీవుడ్‌లోని పెద్ద మనుషులు, నా కుటుంబం, నా జీవితంతో ఆడుకొన్నారు. నన్ను మానసికంగా, శారీరకంగా హింసించారు. నేను పెట్టిన కేసును తుంగలో తొక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులను తమ పరపతి, డబ్బుతో కొనాలని చూస్తున్నారు. అసలు నాకు న్యాయం జరుగుతుందా అనే భయం వెంటాడుతున్నది అంటూ అపర్ణా తన పోస్టులో పేర్కొన్నారు.

సామూహిక అత్యాచారం కేసులో

మోడల్ అపర్ణ ఫిర్యాదు మేరకు బంద్రా పోలీసులు కేసు నమోదు చేశారు. అపర్ణ పేర్కొన్న తొమ్మిది మంది టీ సిరీస్‌ అధినేత కృష్ణన్ కుమార్, నిఖిల్ కామత్, షీల్ గుప్తా, అజిత్ థాకూర్, గుర్జోత్ సింగ్, విష్ణు ఇందూరి, అనిర్బన్ బ్లా తదితరులపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here