నా పెళ్లికి రండి.. సీఎం కేసీఆర్‌కు పెండ్లిపత్రిక అందజేసిన హీరో నితిన్

0
47

కరోనా కారణంగా పలు వాయిదాల తర్వాత టాలీవుడ్ హీరో నితిన్ వివాహం కార్యక్రమానికి మార్గం సుగమమైంది. గతంలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌గా పెళ్లి చేసుకోవాలనుకొని ప్లాన్ చేసుకొంటే లాక్‌డౌన్ కారణంగా ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. తాజాగా లాక్‌డౌన్ నిబంధనలు కొనసాగుతుండటంతో, పరిస్థితులు అదుపులో లేకపోవడం వల్ల పెళ్లిని నిరాడంబరంగా నిర్వహించేందుకు నితిన్ ఫ్యామిలీ నిర్ణయం తీసుకొన్నది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌ను కలిసి నితిన్ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ వార్తకు సంబంధించి వివరాల్లోకి వెళితే..

డెస్టినేషన్ వెడ్డింగ్ క్యాన్సిల్
అమెరికాకు చెందిన షాలినితో కొద్దికాలంగా నితిన్ ప్రేమలో ఉన్నారు. ఇరు కుటుంబాలు అంగీకరించడంతో వారి పెళ్లికి ఏప్రిల్ 15వ తేదీన వివాహం, ఏప్రిల్ 16వ తేదిన రిసెప్షన్‌కు ఏర్పాట్లు చేశారు. దుబాయ్‌లో జరిగే డిస్టినేషన్ వెడ్డింగ్‌కు దాదాపు 100 మంది అతిథులను ఆహ్వానించారు. అయితే కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందడం, పలు దేశాల్లో కఠిన నిబంధనలు విధించడంతో నితిన్ పెళ్లి ఏర్పాట్లు రద్దు చేశారు. ఆ తర్వాత పలుమార్లు పెళ్లికి తేదీలు నిర్ణయించినప్పటికీ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల వాయిదా వేశారు.

నిరాడంబరంగా హైదరాబాద్‌లోనే
కరోనావైరస్ వ్యాప్తి తగ్గే అవకాశం లేకపోవడం హైదరాబాద్‌లో పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటంతో ఘనంగా పెళ్లికి ఏర్పాట్లు చేయకుండా కుటుంబ కార్యక్రమంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు. జూలై 26వ తేదీ రాత్రి 8.30 నిమిషాలకు హైదరాబాద్‌ నగర శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో కుటుంబ కార్యక్రమంగా వివాహాన్ని జరిపించాలని నిర్ణయించారు. నున్నారు. ఇప్పటికే శాలిని కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు చేరుకొన్నట్టు సమాచారం.

సీఎం కేసీఆర్‌కు పెళ్లి ఆహ్వాన పత్రిక
వివాహ వేడుక తేదీ దగ్గరపడుతుండటంతో ప్రముఖులను ఆహ్వానించే పనిలో పడ్డారు. ఆ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్ ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను హీరో నితిన్ తన సన్నిహితులతో కలిసి కలుసుకొన్నారు. సీఎం కేసీఆర్‌ను పెళ్లికి హాజరుకావాలని మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. నితిన్ ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్.. ముందస్తుగా వివాహ శుభాకాంక్షలు అందజేశారు. వీలు చూసుకొని పెళ్లికి హాజరవుతానని చెప్పినట్టు సమాచారం.

కుటుంబ కార్యక్రమంగా వివాహ వేడుక
లాక్‌డౌన్ నిబంధనలు కొనసాగుతుండటంతో అతి కొద్ది మంది అతిథులు, కుటుంబ సభ్యుల సమక్షంలో నితిన్ పెళ్లిని నిరాడంబంరంగా నిర్వహించాలని నిర్ణయించారు. కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత సినీ, రాజకీయ, వ్యాపార, అభిమాన వర్గాలకు భారీగా విందును ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. అలాగే కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఫ్యాన్స్ కూడా ఈ వివాహానికి దూరంగా ఉండాలని కోరినట్టు తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here