నాలుగు పదుల వయసులోనూ శైలూ మాదిరిగానే

0
26

నీ మనసు నాకు తెలుసు అంటూ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ త్రిష రెండు దశాబ్దాలు కావస్తున్నా కూడా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూనే ఉంది. ఈమె నటించిన నటిస్తున్న సినిమాలు విడుదలకు సిద్దంగానే ఉన్నాయి. దాదాపు రెండు దశాబ్దాల సినీ కెరీర్ లో త్రిష ఎన్నో రోల్స్ చేసింది. అందులో గ్లామర్ రోల్స్ ఉన్నాయి కొన్ని నటనకు ఆస్కారం ఉన్న రోల్స్ ఉన్నాయి. హీరోయిన్స్ వయసు పెరుగుతున్నా కొద్ది గ్లామర్ రోల్స్ తగ్గించుకోవాలి. లేదు అలాగే స్కిన్ షో చేస్తాం గ్లామర్ గా కనిపిస్తాం అంటూ ప్రయత్నిస్తే ప్రేక్షకుల నుండి తిరష్కరణ తప్పదు. కాని ఇది అందరి విషయంలో కాదని త్రిష నిరూపించింది.

నాలుగు పదుల వయసుకు దగ్గర పడ్డా కూడా త్రిషను అభిమానులు స్కిన్ షో పాత్రల్లో చూడాలనుకుంటున్నారు. ఈమె పాతిక ముప్పై ఏళ్ల అమ్మాయిగానే ఇంకా కనిపిస్తుందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల త్రిష షేర్ చేసిన ఈ ఫొటో ఆమె ఏజ్ మరింత తగ్గినట్లుగా చూపిస్తుంది. పాతికేళ్ల లోపు యువతి గా త్రిష కనిపిస్తుందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నాలుగు పదుల వయసుకు చేరువయ్యిన త్రిష ఎలా ఇంత అందంగా కనిపిస్తుందంటున్నారు. త్రిష ఇప్పటికి యంగ్ హీరోలతో రొమాన్స్ కు సిద్దం అన్నట్లుగా ఉందంటూ కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

నిజంగానే త్రిష ఈ ఫొటోలో 2004 లో వచ్చిన ప్రభాస్ వర్షం సినిమాలో శైలూగా కనిపించినట్లుగానే కనిపిస్తోంది. కెరీర్ ఆరంభంలో ఎలా ఉందో దాదాపు 20 ఏళ్ల తర్వాత కూడా అలాగే త్రిష కనిపిస్తుందంటే ఆమె అందం ఏంటో అర్థం చేసుకోవచ్చు. పరిస్థితి చూస్తుంటే త్రిష మరో పది పదిహేనేళ్లు అలాగే కనిపిస్తుందేమో అంటున్నారు. త్రిష ఈమద్య కాలంలో ఎక్కువగా తమిళ సినిమాలు మరియు మలయాళం సినిమాల్లోనే కనిపిస్తుంది. తెలుగులో ఈమె సినిమాల కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు.  త్రిష తెలుగు లో డైరెక్ట్ సినిమాతో వచ్చి దాదాపుగా అయిదేళ్లు అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here