నాలుగు ఏళ్ల తర్వాత ‘స్పైడర్’ ను తొలగించిన మురుగదాస్

0
24

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ కెరీర్ లో చాలా డిజాస్టర్స్ ఉన్నాయి. అందులో ప్రధానమైనది స్పైడర్ సినిమా అనడంలో సందేహం లేదు. తమిళంతో పాటు తెలుగు లో ది గ్రేట్ డైరెక్టర్ అనిపించుకోవడంతో పాటు బాలీవుడ్ లో టాప్ డైరెక్టర్స్ తో పోటీ పడ్డ మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా అనగానే అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా పెరిగి పోయాయి. మహేష్ బాబుతో స్పైడర్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు మురుగదాస్ ఓ రేంజ్ లో పబ్లిసిటీ కూడా చేశాడు. మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశం వచ్చినందుకు అద్బుతంను ఆవిష్కరించాను అన్నట్లుగా ఆయన పబ్లిసిటీ కార్యక్రమాల్లో చెప్పాడు. అంతగా చెప్పిన ఆయన తీసిన సినిమా ఏంటో అందరికి తెల్సిందే.

సినిమా నిరాశ పర్చడం పర్వాలేదు.. కాని సినిమా ను ఆకాశానికి తీసుకు వెళ్లి.. ఆ సినిమాపై అంచనాలు పెట్టుకున్న అభిమానులను ఎక్కడికో తీసుకు వెళ్లి అక్కడ నుండి కింద పడేయడం వల్ల మురుగదాస్ పై మహేష్ బాబు అభిమానులకు పీకల్లోతు కోపం ఉంది. దాంతో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా స్పైడర్ సినిమా విషయం ఎత్తిన ప్రతి సారి మురుగదాస్ ను విపరీతంగా ట్రోల్స్ చేస్తూ మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. కొన్ని సినిమాల గురించి అప్పటికప్పుడు మర్చి పోతే బాగుంటుంది. కాని దాన్ని మళ్లీ మళ్లీ గుర్తుకు తీసుకు వస్తే మాత్రం మహేష్ బాబు అభిమానులు ఊరుకోరు అని మురుగదాస్ కు చాలా సందర్బాల్లో తెలిసింది.

ఎంతగా అభిమానులు ట్రోల్ చేసినా కూడా స్పైడర్ వచ్చి నాలుగు ఏళ్లు అయ్యే వరకు కూడా అంటే నిన్న మొన్నటి వరకు కూడా తన ట్విట్టర్ హ్యాండిల్ కవర్ పేజీగా స్పైడర్ ఫొటోనే పెట్టాడు. ఆ తర్వాత ఆయన చాలా సినిమాలు చేసినా కూడా స్పైడర్ ఫొటోనే ఉంచాడు. మురుగదాస్ ట్విట్టర్ హ్యాండిల్ చూసిన ప్రతి సారి కూడా మహేష్ బాబు అభిమానులకు కోపం కట్టలు తెంచుకునేందుకు ఎందుకు ఆ పోస్టర్ ను ఇంకా ఉంచుతున్నారు అంటూ చాలా మంది చాలా రకాలుగా మురుగదాస్ ను అడిగారు. ఆయన మాత్రం మార్చేందుకు ఇన్ని రోజులు ఆసక్తి చూపించలేదు. మహేష్ బాబు పై అభిమానంతో ఆయన ఉంచాడు అనేది కొందరి టాక్. స్పైడర్ ప్లాప్ అయినందుకు మహేష్ బాబుతో సినిమా తీసి హిట్ కొట్టాలని మురుగదాస్ కోరిక. అది నెర వేరేనా అంటే డౌటే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here