నభాకి గబగబా రెండు మూడు హిట్లు పడాల్సిందే!

0
19

నభా నటేశ్ చూడటానికి ముద్దుగా .. బొద్దుగా కనిపిస్తుంది. కొంటె నవ్వులతో .. కోర చూపులతో ఊరిస్తుంది. పిల్ల మందారం మొగ్గలా .. కేరళ కొబ్బరి ముక్కలా ఉండటంతో కుర్రాళ్లంత ఆమె అభిమానులుగా .. ఆరాధకులుగా మారిపోయారు. ఈ అమ్మాయి హీరోయిన్ గా చేసిన సినిమాలను మొదటి రోజునే చూసే ప్రేక్షకుల జాబితాలో చేరిపోయారు. ఇక ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో ఈ అమ్మాయి చేసిన అందాల అల్లరిని చూసిన తరువాత చాలామంది కుర్రాళ్లు ఇంటికి వెళ్లడానికి ఇష్టపడలేదట. అందానికి ఆ మాత్రం ఆకర్షణ శక్తి ఉంటుంది మరి!

నభా రూపు రేఖాలు .. చూపులతోనే లేఖలు రాయించేలా ఉంటాయి. మోడ్రన్ డ్రెస్సుల్లోను .. చీరకట్టులోను మత్తెక్కిస్తుంది .. మతిపోగొడుతుంది. అందువల్లనే ఈ పిల్లను వెతుక్కుంటూ వరుసగా అవకాశాలు వచ్చాయి. ‘డిస్కో రాజా’ .. ‘సోలో బ్రతుకే సో బెటర్’ .. ‘అదుర్స్ అల్లుడు’ సినిమాలను చకచకా చేసేసింది. మాస్ ఆడియన్స్ మనసు వీధుల్లో తన గ్లామర్ తో దుమ్ముదులిపేసింది. అందాల ఆరబోత విషయంలో పట్టింపులే లేని ఈ అమ్మాయికి అదృష్టంతో అసలు పడటం లేదనే అనిపిస్తోంది.

ఎందుకంటే ఒకదాని తరువాత ఒకటిగా వస్తున్న సినిమాలు ఫ్లాప్ ముద్ర వేయించుకుని షెడ్డుకు వెళ్లిపోతున్నాయి. ఇక్కడ ఎంత అందం ఉన్నా .. ఎంతగా అందాలు ఆరబోసినా వాటికి సక్సెస్ తోడుకావాలి. లేదంటే ఎవరైనా మూటాముల్లె సర్దుకోవలసిందే .. మరో ఇండస్ట్రీకి మకాం మార్చాల్సిందే. అందువల్లనే ఇప్పుడు ఈ పిల్ల కంగారు పడుతోందట. అదృష్టాన్ని వెతికి పట్టుకుని లాన్ లో కట్టేసే ప్రయత్నంలోనే ఉందని అంటున్నారు. ఎందుకంటే ‘మాస్ట్రో’ రిలీజ్ నాటికి ఆమెకి అదృష్టంతో చాలా పనే ఉంటుంది. నభాకి గబగబా రెండు మూడు హిట్లు పడకపోతే కష్టమే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here