దొంగల బీభత్సంతో ఉన్న డబ్బు పోగొట్టుకున్న సౌందర్య, సాయి కుమార్.. తిండికి కూడా లేని పరిస్థితుల్లో..

0
9

టాలీవుడ్ ఇండస్ట్రీలో విభిన్నమైన సినిమాగా వచ్చిన అంతఃపురం ఏ రేంజ్ లో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో ప్రతి ఒక్కరు అద్భుతమైన నటనతో మంచి గుర్తింపు అందుకున్నారు. అయితే సినిమా షూటింగ్ కోసం బయట దేశం వెళ్లినప్పుడు ఒక దొంగతనం జరిగిందట. తెచ్చుకున్న డబ్బులు మొత్తం పోవడంతో తినడానికి చాలా కష్టం అయ్యిందట. ఆ విషయాన్ని చిత్ర సహా నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు.

టాలీవుడ్ స్పెషల్ మూవీ అంతఃపురం

సౌందర్య, సాయి కుమార్, జగపతిబాబు , ప్రకాష్ రాజ్ వంటి టాలెంటేట్ యాక్టర్స్ నటించిన అంతఃపురం సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన సినిమా అని చెప్పవచ్చు. పి.కిరణ్ సినిమాను నిర్మించారు. నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా సహా నిర్మాతగా ఉండగా కృష్ణవంశీ సినిమాను చాలా కాస్ట్లీగా తెరకెక్కించారు.

వరుసగా నంది అవార్డులు

అంతఃపురం సినిమా 1998లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు కృష్ణవంశీ మేకింగ్ అప్పట్లో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఏకంగా 8 నంది అవార్డులను సొంతం చేసుకొని సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. బాక్సాఫీస్ వద్ద కూడా సినిమా నిర్మాతలకు మంచి లాభాలను అందించింది.

డబ్బు మొత్తం ఎత్తుకొని వెళ్లిపోయారు

అయితే ఒకసారి సినిమా షూటింగ్ లో చేదు అనుభవం ఎదురైనట్లు సహా నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వివరణ ఇచ్చారు. ఈస్ట్ ఆఫ్రికా మారుషూయస్ కు షూటింగ్ కు వెళ్లినప్పుడు అక్కడ హోటల్ లో ఒక్కసారిగా దొంగలు చొరబడి బీభత్సం సృష్టించారు. డబ్బు మొత్తం ఎత్తుకొని వెళ్లిపోయారు.

బ్యాగులో లక్షల రూపాయలు

హోటల్ గదులకు తాళాలు వేసి మేము షూటింగ్ కు వెళ్లిపోయాము. కానీ ఎలా చొరబడ్డారో తెలియదు గాని దొంగలు బ్యాగులో ఉన్న డబ్బు మొత్తం దోచుకెళ్లారు. సౌందర్య, సాయి కుమార్ మొదట్లో డబ్బులు ఏమి లేవని అన్నారు. కానీ వాళ్ళ బ్యాగ్ లలో లక్ష రూపాయలు ఉన్నాయి. దొంగలు వాటిని ఎత్తుకొని పోయాక ఆ విషయాన్ని మాతో చెప్పారు.. అని భరద్వాజ సరదాగా చెప్పారు.

చాలా ఆకలి వేసింది..

ఇక షూటింగ్ చివరి రోజుల్లో మా దగ్గర ఉన్న డబ్బు మొత్తం అయిపోయింది. ప్రొడక్షన్ హౌజ్ కు సంబంధించిన 5 డాలర్లు ఉంటే అవి అందరికి సమానంగా ఇచ్చాను. నా దగ్గర ఒక్క డాలర్ కూడా లేదు. చాలా దారుణమైన ఆకలి వేసింది గాని ఎవరిని అడగలేని పరిస్థితి. ఆ టైమ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న శ్రీవాస్ వచ్చి నా దగ్గర 5 డాలర్లు ఉన్నాయి అనగానే అప్పుడు కొంత ఆకలి తీర్చుకున్నాను అని తమ్మారెడ్డి వివరణ ఇచ్చారు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here