దేవి మాటలు ‘పుష్ప’ను ఎక్కడికో తీసుకు వెళ్లాయి

0
24

అల్లు అర్జున్.. సుకుమార్ ల కాంబోలో రూపొందుతున్న పుష్ప సినిమా విడుదలకు ముందే బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ అన్నట్లుగా అభిమానులు నమ్మకంగా చెప్పుకుంటున్నారు. బన్నీ మరియు సుకుమార్ లు ఇద్దరు కూడా ఇండస్ట్రీ హిట్స్ తర్వాత కలిసి చేస్తున్న సినిమా అవ్వడం వల్ల సహజంగానే అంచనాలు పీక్స్ లో ఉంటాయి. ఆ అంచనాలు పెంచే విధంగా పుష్ప సినిమా లోని బన్నీ లుక్ ఉంది. ఇక ఇటీవల వచ్చి పుష్ప రాజ్ పరిచయ వీడియో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూసేలా చేసింది. తాజాగా దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ పుష్ప గురించి మరియు చిత్ర యూనిట్ సభ్యుల గురించి చేసిన వ్యాఖ్యలు మరో లెవల్. దేవి మాటలు పుష్ప ను ఎక్కడికో తీసుకు వెళ్లాయి.

సుకుమార్ తన ప్రతి సినిమా కు కూడా దేవి శ్రీ తో వర్క్ చేస్తూ ఉంటాడు. సినిమా ల ఫలితం తో సంబంధం లేకుండా వీరి మ్యూజిక్ ఆల్బం లు భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లుగా నిలిచాయి. వీరి కాంబోలో వచ్చిన గత సినిమా రంగస్థలం లోని ప్రతి పాట సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన విషయం తెల్సిందే. ఇక దేవిశ్రీ ప్రసాద్ ఇటీవల ఒకానొక సందర్బంగా పుష్ప గురించి మాట్లాడుతూ.. సుకుమార్ విజన్ ఏంటో ఈ సినిమా తో మరో సారి వెళ్లడి అవుతుంది. తన ప్రతి సినిమా లో కొత్తదనంను చూపించే సుకుమార్ ఈ సినిమాలోనూ అదే తరహా ఫార్ములాను కంటిన్యూ చేశాడు.

సుకుమార్ కొత్తదనపు స్క్రీన్ ప్లే మరియు టెక్నికల్ అంశాలతో సినిమా స్థాయి మరో లెవల్ కు చేరిందన్నారు. సుకుమార్ గారు కథ చెప్ప విధానం అద్బుతంగా ఉంటుంది. ఇప్పుడు పుష్ప లో కథ చెప్పే విధానం అంతకు మించి అన్నట్లుగా ఉంటుంది. సినిమా పూర్తి స్థాయి లో మాస్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయడంతో పాటు క్లాస్ ఆడియన్స్ కు కూడా కనెక్ట్ అయ్యేలా ఉంటుందన్నాడు. ఇక బన్నీ పాత్ర కోసం పడుతున్న కష్టం అద్బుతం. పుష్ప కోసం తనను తాను మల్చుకున్న తీరు నిజంగా అద్బుతం అంటూ దేవిశ్రీ ప్రసాద్ అన్నాడు. దేవి చేసిన ఈ వ్యాఖ్యలు పుష్ప స్థాయిని ఎక్కడికో తీసుకు వెళ్లాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here