దసరా వైపే అందరి చూపు?

0
26

సెకండ్ వేవ్ అంతా మార్చేసింది. సినిమా షూటింగులు నిలిచిపోవడంతో వాటి రిలీజ్ తేదీలపై క్లారిటీ మిస్సయ్యింది. ఇప్పటికే ఈ మూడు మాసాల్లో రిలీజ్ కావాల్సిన వాటి తేదీలు మారాయి. వేసవి వృధా అయ్యింది. ఏప్రిల్ – మే-జూన్ సీజన్ లో రావాల్సిన క్రేజీ చిత్రాలేవీ రిలీజ్ కావడం లేదు. చాలా సినిమాలు వాయిదా పడ్డాయి.

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య తదుపరి దసరా కానుకగా రిలీజ్ కానుందని ప్రచారమవుతోంది. తొలుత చిరు బర్త్ డే సందర్భంగా ఆగస్టులో వస్తుందని ప్రచారమైనా ఇప్పుడు అక్టోబర్ కి వెళ్లిందన్న టాక్ వినిపిస్తోంది.

ప్రభాస్ `రాధే శ్యామ్` దాసరా విడుదలను లక్ష్యంగా చేసుకుంది. ఇది పాన్ ఇండియా కేటగిరీలో రిలీజవుతుంది. అయ్యప్పనమ్ కోషియం రీమేక్ చిత్రీకరణను పవన్ కళ్యాణ్ త్వరలో పూర్తి చేయనున్నారు. ఈ చిత్రం కూడా దసరా రేస్ లోకి వచ్చింది. మూడు పెద్ద రిలీజ్ లు.. వీటితో పాటు ఇంకా  ఇతర సినిమాలు కూడా దసరా కానుకగా రిలీజయ్యేందుకు ఆస్కారం ఉంది.

ఇక కరోనా సెకండ్ వేవ్ శాంతించి థియేటర్లు తిరిగి ప్రారంభమైతే వెంటనే రిలీజ్ చేసేందుకు పలువురు నిర్మాతలు సిద్దంగా ఉన్నారు. వీటిలో లవ్ స్టోరీ- టక్ జగదీష్- విరాఠ పర్వం-సీటీమార్ వంటి సినిమాలు ఉన్నాయి. దసరా బరిలో భారీ చిత్రాల రిలీజ్ లు ఉంటాయి కాబట్టి కాస్త అటూ ఇటూగా ఇవన్నీ రిలీజవుతాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ రెండు డోసులు వేగంగా పూర్తవ్వాలి. ప్రజల ప్రాణాలకు మినిమం భరోసా కావాలి. అప్పుడే ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. కనీసం దసరా ముందు ఈ మూడు నెలల కాలంలోనే వేగంగా ఇదంతా పూర్తవుతుందని ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here