#దళపతి 65 .. ఈ మాలీవుడ్ నటుడికి తెలుగులోనూ ఆఫర్!

0
31

దళపతి విజయ్ నటిస్తున్న 65వ చిత్రానికి  నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని వరుస విజయాల తర్వాత విజయ్ అజేయమైన ట్రాక్ రికార్డుకి మరో విజయాన్ని యాడ్ చేసేందుకు అతడు గట్టి ప్రయత్నాల్లోనే ఉన్నాడు. ఈసారి మాలీవుడ్ మార్కెట్ ని కొల్లగొట్టాలనే పంతంతో ఉన్నట్టే కనిపిస్తోంది.

అందుకే అతడు వరుసగా మలయాళీ స్టార్లను ఈ ప్రాజెక్టులోకి ఏర్చి కూర్చుతున్నారు. కొద్ది రోజుల క్రితం మలయాళ నటి అపర్ణ దాస్ ని ఒక కీలక పాత్ర కోసం ఎంపిక చేశారు. ఇప్పుడు M- టౌన్ నుండి మరో నటుడు ఈ ప్రాజెక్ట్ లో చేరబోతున్నట్లు ప్రకటించారు. అతడి పేరు షైన్ టామ్ చాకో. మాలీవుడ్ వెలుపల అతని మొదటి చిత్రం ఇదే.

దళపతి 65 షూట్ మొదటి షెడ్యూల్ జార్జియాలో ఇప్పటికే పూర్తయింది. కోవిడ్ పరిమితుల కోసం కాకపోతే తదుపరి షెడ్యూల్ త్వరలో ప్రారంభమవుతుందని నేను ఊహిస్తున్నాను. జూన్ లో చిత్రీకరణపై ఆలోచిస్తున్నారు. నేను చర్చలు పూర్తి చేసి జాయినయ్యాను.. అని షాన్ తెలిపారు.

తమిళం సౌకర్యమేనా? అని ప్రశ్నిస్తే..“మాట్లాడుతాను . కానీ నేను ఇంకా తమిళంలో నిష్ణాతుడిని కాదు“ అని తెలిపారు. నేను తమిళ చిత్రాలను తరచూ చూస్తుంటాను. కమల్ హాసన్ .. రజనీకాంత్ వంటి తమిళ నటుల ఇంటర్వ్యూలు ప్రసంగాలు కూడా చూస్తాను. నాకు అర్థం కాని కొన్ని పదాలున్నాయి. కానీ మొత్తంగా.. నేను దాని నుండి అర్ధవంతమైన పదప్రయోగాలు చేయగలను అని తెలిపాడు.

తెలుగు పరిశ్రమ నుండి కూడా తనకు ఆఫర్ ఉందని అతడు వెల్లడించాడు. నేను తమిళ భాషను కనీసం కొన్ని పదాలను అయినా గుర్తించగలిగినా.. తెలుగు కన్నడలను ఇంకా నేర్చుకోవాల్సి ఉంది.. అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here