దర్శకుడికి మహేష్ మూడు నెలల టైమ్

0
14

సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా తో వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గీత గోవిందం సినిమా తో సూపర్ హిట్ ను దక్కించుకున్న పరశురామ్ కాస్త గ్యాప్ తీసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న అవినీతి మరియు కొందరు వ్యాపారవేత్తలు అక్రమంగా తీసుకుంటున్న రుణాలు ఎగవేత వంటి విషయాలను ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా చెబుతున్నారు. గత ఏడాది ఆరంభంలోనే ఈ సినిమా ప్రకటన వచ్చింది. కాని కరోనా కారణంగా సినిమా ఒక్క షెడ్యూల్ మాత్రమే పూర్తి అయ్యింది. సినిమాను పూర్తి చేసి వచ్చే సమ్మర్ లో విడుదల చేయాలనే పట్టుదలతో మహేష్ బాబు ఉన్నాడు.

ఇప్పటికే సర్కారు వారి పాట కోసం ఎక్కువ సమయం కేటాయించడం జరిగింది. షూటింగ్ జరిగినా లేకున్నా మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా తోనే గత ఏడాదిగా నెట్టుకు వస్తున్నాడు. ఇంకా ఎక్కువ కాలం ఆ సినిమా తోనే సమయంను వృదా చేయవద్దనే ఉద్దేశ్యంతో త్రివిక్రమ్ తో సినిమాను ప్రకటించాడు. ఇప్పటికే మహేష్ బాబు త్రివిక్రమ్ ల కాంబోలో సినిమా పట్టాలు ఎక్కబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. త్రివిక్రమ్ గత ఏడాది నుండి ఖాళీగా ఉన్నాడు. కనుక వెంటనే మహేష్ బాబుతో సినిమా మొదలు పెట్టాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే మహేష్ బాబు సర్కారు వారి పాట ను వెంటనే పూర్తి చేయాలని భావిస్తున్నాడట.

మీడియా సర్కిల్స్ ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా చిత్రీకరణకు మరో మూడు నెలల సమయంను మహేష్ బాబు పెట్టాడని తెలుస్తోంది. మహేష్ బాబు మరియు పరశురామ్ ల కాంబోలో రూపొందుతున్న సర్కారు వారి పాట షూటింగ్ పునః ప్రారంభంకు జులై 15 నుండి ముహూర్తం ఖరారు చేశారు. సినిమా ను సెప్టెంబర్ వరకు ముగించి త్రివిక్రమ్ సినిమా తో మహేష్ బాబు బిజీ అవ్వాలని భావిస్తున్నాడట. అందుకే మూడు నెలల్లో సర్కారు వారి పాట పూర్తి చేయాలని దర్శకుడు పరశురామ్ ను మహేష్ బాబు ఆదేశించాట. దాంతో పరశురామ్ షూటింగ్ ను స్పీడ్ గా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. కరోనా సహకరిస్తే సెప్టెంబర్ చివరి వరకు సినిమాను ముగించేసేలా ప్లాన్ చేస్తున్నారు. కాస్త అటు ఇటు అయితే అక్టోబర్ లో ఖచ్చితంగా సర్కారు వారి పాటకు గుమ్మడి కాయ కొట్టబోతున్నారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here