థై సొగసుల ఎలివేషన్ లో రష్మిక నిర్మొహమాటం

0
41

ఇప్పుడున్న కాంపిటీషన్ లో నెగ్గుకు రావాలంటే అంత సులువేమీ కాదు. ఇంతమంది కథానాయికలు సోషల్ మీడియాల్లో తమదైన శైలిలో విరుచుపడుతున్నారు. ఫోటోషూట్లలో ఆకాశమే హద్దుగా క్రియేటివిటీతో హీటెక్కిస్తున్నారు. నేటితరంలో గ్లామర్ షోకి అడ్డు అదుపు కూడా లేనేలేదు.

అందుకే ఇప్పుడు బాలీవుడ్ లో అడుగుపెట్టిన రష్మిక మందన తనదైన శైలిలో కొత్త పోకడలకు పోతోంది. ఇటీవల ఈ బ్యూటీ బొత్తిగా పిసినారి అయిపోతోంది. ఒంటిపై నూలుపోగైనా లేకుండా.. డ్రెస్సింగ్ ఎంత తక్కువగా ఉంటే అంతా ట్రెండీ అని ఫీలవుతోంది. తాజాగా రష్మిక మందన పొట్టి నిక్కరులో ప్రత్యక్షమైంది. వైట్ టీషర్ట్.. దానిపై బ్లూ జాకెట్ ని ధరించి అల్ట్రా స్టైలిష్ గా కనిపిస్తోంది.

కెరీర్ మ్యాటర్ కి వస్తే..స్పై థ్రిల్లర్ మిషన్ మజ్ను తో ఆమె బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న రష్మిక.. ద్వితీయ ప్రయత్నమే అమితాబ్ బచ్చన్ నటించిన `గుడ్ బాయ్`లో అవకాశం అందుకుంది. ఈ చిత్రంలో అమితాబ్- రష్మిక తండ్రి కూతుళ్లుగా కనిపిస్తారు. త్వరలోనే బాలీవుడ్ లో మూడో చిత్రానికి సంతకం చేయబోతున్నానన తెలిపింది. అలాగే ఈ బ్యూటీ మెక్ డొనాల్డ్ పిజ్జా బ్రాండ్ కి ప్రమోటర్ గా ఎంపికైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here