థమన్ లోని ఉగ్రుడు అలా బయటికొచ్చాడు..!

0
28

సంగీత దర్శకుడు థమన్ ఎంతో సౌమ్యుడు. కానీ నెటిజనుల ట్రోలింగ్ అదుపుతప్పిన ప్రతిసారీ అతడిలోని ఉగ్రుడు బయటికొస్తున్నాడు. ఇంతకుముందు తనని కాపీ క్యాట్ అని విమర్శించిన చాలా మందికి అదిరిపోయే కౌంటర్లు వేశాడు.

తాజాగా ఓ నెటిజన్ కి థమన్ ఇచ్చిన కౌంటర్ ఆశ్చర్యపరిచింది. థమన్ ఎందుకంత వైలెంట్ గా రియాక్టయ్యారో తెలియాలంటే అసలు మ్యాటర్ లోకి వెళ్లాలి. నాగార్జున నటించిన `కింగ్` సినిమాలో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ ఏ స్థాయిలో పండిందో తెలిసిందే. అందులో కాపీ  మ్యూజిక్ డైరెక్టర్ పాత్రలో బ్రహ్మానందం కడుపుబ్బా నవ్వించారు. ఆ పాత్ర తాలుకా కొన్ని స్టిల్స్ ని షేర్ చేసిన నెటిజన్ రేపు పొద్దున్న  తన పిల్లలకు ఇతనే థమన్ అని  చూపిస్తా! అంటూ కామెంట్ చేసాడు. థమన్  ట్విటర్ హ్యాండిల్ కి దానిని ట్యాగ్ చేసి విమర్శించాడు. ఇది తమన్ కంటపడటంతో అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు.

“నీ భార్యకు ఇలా మీమ్స్ చేసుకుంటూ బిజీగా ఉన్నానని చెప్పు.. అప్పుడు ఆమె ఓ పనికిమాలిన  మీమర్ ని పెళ్లాడానని గర్వ పడుతుంది“ అంటూ థమన్ కౌంటర్ వేసాడు. దీంతో సదరు నెటిజన్ కు సౌండ్ లేదు. మాట పడిపోయింది. థమన్ ప్రతి స్పందన ఇలా ఉంటుందని ఊహించకలేకపోయాడేమో.. ఆ దెబ్బకు కామ్ అయిపోయాడు.

“మంచి పనిచేసాడు.. ఇలాంటి వాళ్లకు ఇలాగే సమాధానమివ్వాలంటూ“ సాటి నెటిజనులు థమన్ కే మద్దతు తెలుపుతున్నారు. థమన్ ఆల్వేస్ బిజీ మ్యూజిక్ డైరెక్టర్. మహేష్.. పవన్ లాంటి టాప్ స్టార్ల సినిమాలకు ప్రస్తుతం సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here