త్రిముఖ పోటీ.. `మా` ఎన్నికల బరిలో జీవిత..!

0
26

సెప్టెంబర్ లో జరగనున్న తెలుగు మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికలు ఈసారి మరింత రసవత్తరంగా మారుతున్నాయి. అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్ – మంచు విష్ణు పోటీపడుతున్న సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ అండదండలతో ప్రకాష్ రాజ్ పోటీబరిలో నిలుస్తుండగా.. ఘట్టమనేని ఫ్యామిలీ.. కృష్ణంరాజు అండదండలతో మంచు విష్ణు బరిలో నిలిచారు. ఆ ఇద్దరూ ఇప్పటికే ప్యానెల్ ఎంపికలో ఉన్నారు. ప్రచారం పరంగానూ దూసుకుపోతున్నారు.

అయితే ఈసారి మా ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండనుంది. ఆ ఇద్దరితో పాటు జీవిత రాజశేఖర్ అధ్యక్ష పదవికి పోటీపడనున్నారు. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. జీవిత రాజశేఖర్ గతంలో `మా` జనరల్ సెక్రటరీగా పనిచేసిన సంగతి తెలిసిందే. రాజశేఖర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికవ్వగా అధ్యక్షుడు నరేష్ తో వివాదాల వల్ల తన పదవి నుంచి వైదొలిగారు. ఈసారి జీవిత రాజశేఖర్ బృందం నేరుగా అధ్యక్ష పదవికి పోటీపడాలని నిర్ణయించడం ఆసక్తిగా మారింది.

మంచు విష్ణుకి ఇప్పటికే సుమారు 200 మంది ఆర్టిస్టుల మద్ధతు ఉందని గుసగుసలు వినిపిస్తుండగా.. ప్రకాష్ రాజ్ కి మెగా కాంపౌండ్ మద్ధతు ప్రధాన అండగా ఉంది. మా రాజకీయాల్లో సీనియర్ స్టార్లుగా కొనసాగుతున్న జీవిత రాజశేఖర్ బలాబలాలు ఎంత? అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం త్రిముఖ పోటీ ఖాయమైంది కాబట్టి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మరోవైపు ఈసారి పోటీ లేకుండా మోహన్ బాబు లాంటి ఛరిష్మా.. కమాండింగ్ పవర్ ఉన్న నాయకుడిని ఎంపిక చేస్తే బావుంటుందనే చర్చా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here